
అమరావతి, అక్టోబర్ 10: ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పుపైనే ప్రధానంగా లోకేష్‌ను ప్రశ్నించింది సీఐడీ. IRR అలైన్‌మెంట్ మార్పు… మీకు ముందే ఎలా తెలుసు?, మూడుసార్లు అలైన్‌మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉందా?, హెరిటేజ్‌కి లబ్ధిచేకూర్చేందుకే అలైన్‌మెంట్ మార్చారా?, మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరులోనే ఎందుకు భూములు కొన్నారు?. అలైన్‌మెంట్ మార్పు గురించి చంద్రబాబే మీకు చెప్పారా?, లింగమనేని రమేష్‌తో మీకున్న సంబంధాలు ఏంటి?, ఇలా ప్రశ్నిస్తోంది సీఐడీ.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ అలా విచారణకు హాజరయ్యారో లేదో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఊహించనివిధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను మార్చేసింది సీఐడీ. ఇప్పటివరకు కేసును దర్యాప్తు చేస్తోన్న అడిషనల్ ఎస్పీ జయరామరాజును ఐవో బాధ్యతల నుంచి తొలగించింది. ఆ ప్లేస్‌లో డీఎస్పీ విజయ్ భాస్కర్‌కు ఛార్జ్ అప్పగించింది. ఆమేరకు ఏసీబీ కోర్టుకు సమాచారమిస్తూ మెమో దాఖలుచేసింది సీఐడీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం