RK Roja: ఓటమిని అంగీకరించిన మంత్రి రోజా.. ఊహించని ట్వీట్.. ఏమన్నారంటే.?

|

Jun 04, 2024 | 6:50 PM

ఏపీలో వన్‌సైడెడ్‌గా కూటమి అభ్యర్ధులు విక్టరీ దిశగా దూసుకుపోతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా వెళ్తోంది. ఇదిలా ఉంటే.. వైసీపీ మంత్రులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో.. ఆ పార్టీకి పరాభవం ఎదురైంది. అందరు మంత్రులు ఓటమికి..

RK Roja: ఓటమిని అంగీకరించిన మంత్రి రోజా.. ఊహించని ట్వీట్.. ఏమన్నారంటే.?
AP Minister Rk Roja
Follow us on

ఏపీలో వన్‌సైడెడ్‌గా కూటమి అభ్యర్ధులు విక్టరీ సాధించారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేశారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. వైసీపీ మంత్రులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో.. ఆ పార్టీకి పరాభవం ఎదురైంది. పెద్దిరెడ్డి మినహా అందరు మంత్రులు ఓటమి పాలయ్యారు. ఇక నగరిలో మంత్రి ఆర్‌కే రోజా తన సమీప టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాశ్‌పై 43,505 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు.

చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ.. ‘భయాన్ని విశ్వాసంగా… ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..