
కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన మూడేళ్ల బాలిక జాహ్నవి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు రోజులైనా ఆచూకీ దొరక్కపోవడంతో డ్రోన్లతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తుని మండలం దొండవాక సమీపంలోని పామాయిల్ తోటలో కాపలా ఉండే దంపతులకు చెందిన చిన్నారి మిస్సవగా పామాయిల్ తోటలతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతంలోనూ గాలింపు చేపట్టారు. పాపతోపాటు పెంపుడు కుక్క కూడా కనపించకుండా పోవడం షాకిస్తోంది. అయితే.. బాలికను ఎవరైనా కిడ్నాప్ చేశారా?.. పొరపాటున అడవిలోకి వెళ్లిందా..? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రెండు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక.. చిన్న పాపకు స్నానం చేయించి వచ్చే లోపే జాహ్నవి కనిపించకుండా పోయిందని చిన్నారి తల్లి చెప్తోంది. అదేసమయంలో ఘటనాస్థలానికి అరకిలోమీటర్ దూరంలో పాప వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు ఉండడంతో టెన్షన్ పుడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చిన్నారి మిస్సయిన ప్రదేశాన్ని స్థానిక MRO GVS ప్రసాద్ పరిశీలించారు. మూడేళ్ల చిన్నారి ఇంతదూరం వెళ్లే ఛాన్స్ లేదని.. చిన్నారి మిస్సింగ్‌పై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. చిన్నారి తల్లిదండ్రులను, చుట్టుపక్కలవారిని పోలీసులు ప్రశ్నించినట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి MRO GVS ప్రసాద్ ఇంకేమంటున్నారో మా చీఫ్ రిపోర్టర్ సత్య వివరిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.