దూసనపూడి జనసేన నేత, సర్పంచ్‌ యర్రంశెట్టి నాగసాయిపై దుండగుల హత్యాయత్నం.. మెరుగైన చికిత్స కోసం ఏలూరుకు తరలింపు

|

Apr 09, 2021 | 5:40 PM

Murder Attempt on Sarpanch: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం దూసనపూడి గ్రామ సర్పంచ్‌ జనసేన పార్టీకి చెందిన యర్రంశెట్టి నాగసాయిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు..

దూసనపూడి జనసేన నేత, సర్పంచ్‌ యర్రంశెట్టి నాగసాయిపై దుండగుల హత్యాయత్నం.. మెరుగైన చికిత్స కోసం ఏలూరుకు తరలింపు
Murder
Follow us on

Murder Attempt on Sarpanch: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం దూసనపూడి గ్రామ సర్పంచ్‌ జనసేన పార్టీకి చెందిన యర్రంశెట్టి నాగసాయిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిషత్‌ ఎన్నికల వివాదం నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వారు ఈ ఘటనకు పాల్పడినట్లు జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భీమవరం ప్రాంతంలో వైసీపీని ఓడించారని, అదే ఫలితం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పునరావృతం అవుతుందేమోనన్న భయంతో సర్పంచ్‌పై దాడికి దిగారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Janasena

ఇవీ చదవండి: Indian Techie: అమెరికాలో విషాదం.. భారతీయ దంపతుల అనుమానస్పద మృతి.. అనాథగా మారిన నాలుగేళ్ల చిన్నారి

Varity Theft: వానరాలే వారి అస్త్రం.. కోతులతో మాయ చేసి లీలగా దోచేస్తారు.. జర భద్రం గురూ !