ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో.. కవిత, మాగుంట పేర్లను చేర్చడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రకపంనలు రేగుతున్నాయి. తాజాగా ఈ ఇష్యూపై మాగుంట స్పందించారు. దక్షిణాదిపై.. ఉత్తరాది పెత్తనమేంటి..? కేంద్రం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతోందా..? అంటే అవుననే అంటున్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కార్ కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ మాగుంట. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ మాగుంట పేరు చేర్చడంపై ఆయన టీవీ9తో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. అమిత్ అరోరా నార్త్ ఇండియన్.. అతనితో తామెందుకు లిక్కర్ వ్యాపారాలు చేస్తామని ప్రశ్నించారు. అమిత్ అరోరా ఎవరో తనకు తెలియదన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. అతని రిమాండ్ రిపోర్టులో తన పేరు ఎందుకు చేర్చారో కూడా తెలియదన్నారు.
లిక్కర్ స్కామ్ ఎపిసోడ్‌లో వినయ్ నాయర్‌కి సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్రూప్ కవిత, మాగుంట, శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నడుస్తోందని, దీంతో వీరి పేర్లను చేర్చింది ఈడీ. లేటెస్ట్‌గా వంద కోట్ల రూపాయలు సమకూర్చిన వారిలో ఎమ్మెల్సీ కవిత, మాగుంట పేర్లను చేర్చింది ఈడీ. ఈడీ లేటెస్ట్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మొత్తం 32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత రెండు ఫోన్ నంబర్లను పది ఫోన్లలో వాడినట్లు పేర్కొన్నారు ఈడీ అధికారులు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్‌పై కాసేపట్లో స్పందించే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఆమె ఏం మాట్లడబోతోందనేది హాట్ టాపిక్‌గా మారింది.
గుర్గావ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడు. ఢిల్లీ మద్యం పాలసీ, మనీలాండరింగ్ కేసులో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పేర్లను చేర్చడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..