Tellam Balaraju dance: పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డ్యాన్స్‌.. సంక్రాంతి సంబరాల్లో భాగంగా డీజే స్టెప్పులు

|

Jan 17, 2021 | 8:55 PM

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సొంత గ్రామంలో యువకులతో కలిసి చిందులు వేశారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్యాన్స్‌ అదరగొట్టారు.

Tellam Balaraju dance: పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డ్యాన్స్‌.. సంక్రాంతి సంబరాల్లో భాగంగా డీజే స్టెప్పులు
Follow us on

Tellam Balaraju dance:  పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సొంత గ్రామంలో యువకులతో కలిసి చిందులు వేశారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్యాన్స్‌ అదరగొట్టారు. గ్రామంలో యువకులు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. డీజే పెట్టి డాన్సులు చేశారు. యువకులు వేస్తున్న చిందులకు ఎమ్మెల్యే బాలరాజు కూడా జత కలిసి అదరగొట్టారు. ఎమ్మెల్యే డ్యాన్స్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గత ఏడాది కూడా ఎమ్మెల్యే సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్‌తో దుమ్ములేపారు.

కాగా సంక్రాంతి సంబరాలు అంటేనే ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు గుర్తుకువస్తాయి. అక్కడి పిండి వంటలు, కోడి పందేలు దేశవ్యాప్తంగా ఫేమస్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఘనంగా జరిగాయి.

 

Also Read:

పండక్కి సొంతూర్లకు వెళ్లిన జనం తిరిగి నగరానికి పయనం.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్