Tadipatri Clashes: రగులుతున్న తాడిపత్రి.. జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్ష నిర్ణయం.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి..

Tadipatri Clashes: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రచ్చ క్రియేట్ చేస్తున్నాయి. ఓ వైపు ఆలయాల వివాదం.. మరోవైపు నేతల మధ్య వివాదలతో రాష్ట్రం..

Tadipatri Clashes: రగులుతున్న తాడిపత్రి.. జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్ష నిర్ణయం.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి..

Updated on: Jan 03, 2021 | 5:08 PM

Tadipatri Clashes: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రచ్చ క్రియేట్ చేస్తున్నాయి. ఓ వైపు ఆలయాల వివాదం.. మరోవైపు నేతల మధ్య వ్యక్తిగత వివాదలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఇక తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, తాజా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వివాదం మరింత ముదిరి పాకాన పడినట్లైంది. తాడిపత్రి వివాదం నేపథ్యంలో సోమవారం నాడు ఆమరణ దీక్ష చేస్తామంటూ జేసీ బద్రర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆదివారం నాడు తాడిపత్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ఉనికిని కాపాడుకునేందుకే వారు దీక్షలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసుల గురించి వారు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. గతంలో వారు అధికారంలోకి ఉన్నప్పుడు అధికారులు, పోలీసులపై అక్రమ కేసులు పెట్టించారని పెద్దారెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా అధికారులను బెదిరించి తమ పనులు చేయించుకున్నారని నిప్పులు చెరిగారు. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఎవరూ ఆయనకు మద్దతు తెలుపడం లేదని, ఆ కారణంగా జేసీ చంద్రబాబును కలిసి మొరపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు డైరెక్షన్ మేరకు జేసీ బ్రదర్స్ దీక్షల పేరుతో డ్రామాలాడేందుకు ముందుకు వస్తున్నారని పెద్దారెడ్డి విమర్శలు గుప్పించారు.

ఇక తాడిపత్రిలో గత కొద్ది రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు నేతల పరస్పర మాటల యుద్ధంతో తాడిపత్రిలో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆందోళన అక్కడి ప్రజల్లో ఉంది. ఈ ఘర్షణ నేపథ్యంలో ఇరు వర్గాలకు చెందిన వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే, ఈ వివాదంపై ఇంతకాలం మౌనంగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి కూడా తాజాగా స్పందించారు. తన తమ్ముడు జేసీ ప్రభాకర్  రెడ్డితో కలిసి ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు.

 

Also read:

Building Collapsed: యూపీలోని మురాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన బిల్డింగ్.. 18 మంది దుర్మరణం..

కాకుల మృతితో అలజడి.. వైరస్ వ్యాప్తి పట్ల కేంద్రం హెచ్చరికలు.. ఆయా రాష్ట్రాల్లో హై-అలెర్ట్..