తాను టీడీపీలోనే ఉన్నానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో యాక్టివ్ గా లేను కానీ సందర్భం వచ్చినపుడు టీడీపీ తరపున స్పందిస్తున్నానని ఆయన అన్నారు. విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగుతున్న నేపథ్యంలో టీడీపీ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పార్టీ తరుఫున లేఖ రాశానని గంటా క్లారిటీ ఇచ్చారు. ఇది రైట్ అకేషన్ కాబట్టే స్పందించినట్లు తెలిపారు. తాను పార్టీకి దగ్గరిగానే ఉన్నట్లు వివరించారు.
ఓ వైపు టీడీపీ తరపున లేఖ రాశానని గంటా చెబుతుంటే.. మరోవైపు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రత్యేకంగా మరో లేఖ విడుదల చేశారు. దీంతో గంటా టీడీపీ తరపున లేఖ రాశారా లేక వ్యక్తిగతంగా రాశారా అన్న చర్చ జరుగుతోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..