Konaseema Floods: ఎగువ రాష్ట్రాలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలతో పాటు.. కోనసీమ చిగురుటాకుల వణుకుతోంది. జిల్లాలోని లంక గ్రామాలు వరద నీటితో నిండిపోయాయి. చర్యలు చేపట్టిన అధికారులు లంక గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు లంక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకుని బిక్కు బిక్కు మంటూ ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు బోట్ల లో వెళ్లి వరద బాధితులను పరామర్శిస్తున్నారు. దైర్యం చెబుతున్నారు.
తాజాగా ఆలమూరు మండలం వరద ముంపు గ్రామంలో బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే బడుగు వాని లంక గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో పడవలోకి వరద నీరు చేరుకుంది. ఆ పడవలో కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. వరద నీరు పడవ లోపలి చేరుకోవడంతో ఒక్కసారిగా పడవ పక్కకి ఒరిగి పోయింది. పడవ నడిపే మత్స్యకారుల అప్రమత్తమయ్యారు. దీంతో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కి ప్రమాదం తప్పింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..