
ఎన్టీఆర్ జిల్లా తక్కెల్లపాడు గ్రామంలో ఒక వింత ఘటన అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా మిరప చెట్టుకి మిరపకాయలు మాత్రమే కాస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక రైతు తోటలో మిరప చెట్టుకే వంకాయలు, టమాటాలు కాసిన ఘటన వెలుగుచూసింది. గ్రామంలోని ఓ రైతు మిరప తోటలో ఈ వింత చెట్లు కనిపించాయి. తోట మొత్తం మీద రెండు చెట్లకే ఈ విచిత్రమైన లక్షణం కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మిరప చెట్టుకి వంకాయ, టమాటాలు కాయడం చూసి అందరూ నివ్వెరపోతున్నారు.
ఇదేదో దేవుని అద్భుతం కావచ్చు అని కొందరు గ్రామస్థులు అంటుంటే… మరికొందరు ఏదో శాస్త్రీయ కారణం వల్ల జరిగి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. స్థానిక వ్యవసాయ అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. మొక్కల జెనెటిక్ మిక్సింగ్ లేదా గ్రాఫ్టింగ్ ప్రక్రియ వల్ల ఇలా జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ విచిత్ర సంఘటనతో తక్కెల్లపాడు గ్రామం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.