Andhra: అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?

విజయనగరం జిల్లాలో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింది. నెల్లిమర్ల పోలీసు స్టేషన్ పరిధిలో 2025 మే నెలలో నమోదైన ఈ కేసులో నిందితుడు పంది నారాయణ (24)కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పును వెల్లడించారు.

Andhra: అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?
Vizianagaram POCSO case

Edited By:

Updated on: Mar 12, 2026 | 11:24 AM

విజయనగరం జిల్లాలో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింది. నెల్లిమర్ల పోలీసు స్టేషన్ పరిధిలో 2025 మే నెలలో నమోదైన ఈ కేసులో నిందితుడు పంది నారాయణ (24)కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పును వెల్లడించారు. అదేవిధంగా ఆరు వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి పరిహారంగా ఐదు లక్షలు చెల్లించాలని ఆదేశించారు. వివరాల ప్రకారం.. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన పంది నారాయణ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చి సంవత్సరం పాటు బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ సమయంలో బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది.

బాలిక తల్లిదండ్రులు గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టడంతో నిందితుడు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి కాలయాపన చేశాడు. అనంతరం 2025 మే 15న బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా ఆమెకు గర్భస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతరం దర్యాప్తును అప్పటి విజయనగరం డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ కేసు కేవలం పది నెలల వ్యవధిలో విచారణ జరిగి నిందితుడికి శిక్ష ఖరారు అయ్యింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోక్సో కేసులలో శిక్ష అమలు విషయంలో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. బాలికలు సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రేమ పేరుతో మోసగాళ్ల మాటలకు లోనుకాకుండా తమ చదువు, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us