క్రాస్‌ఓటింగ్ ఆరోపణలపై స్పందించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదంటూనే పార్టీ టికెట్ విషయంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు మేకపాటి. కాంగ్రెస్ లో అధికారాన్ని వదులుకుని మరీ జగన్ వెంట నడిచామని.. ఉదయగిరి లో తనకు మించిన బలమైన నాయకుడు ఎవరూ లేరన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన తనకు మళ్లీ టికెట్టు ఇస్తే గెలుస్తామ్నారు. అయితే తనకు టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇవ్వాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సీటు కూడా అడగబోనని.. పిలిచి ఇస్తేనే పోటీ చేస్తా అంటూ ప్రకటించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదన్న మేకపాటి చంద్రశేఖరరెడ్డి… తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఆఫీసులో వైసీపీ కలర్ ఫ్లెక్సీలు తొలగించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.