AP Rains: సూపర్ కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు కుండబోత.. ఈ జిల్లాలకు.!

|

Jun 24, 2024 | 5:51 PM

ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

AP Rains: సూపర్ కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు కుండబోత.. ఈ జిల్లాలకు.!
Ap Rains
Follow us on

ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండటంతో.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలెర్ట్ జారీ చేశారు.

సోమవారం.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళవారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బుధవారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గురువారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక తెలంగాణ విషయానికొస్తే.. రాష్ట్రంలో గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుండి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళ, బుధవారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, జగిత్యాల జిల్లాలకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మిగిలిన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయంది.

ఇది చదవండి:  ఏపీ ప్రజలకు ‌గుడ్‌న్యూస్.. ఆ స్టేషన్ వరకు వందేభారత్ రైలు పొడిగింపు.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..