
ఈ మధ్య ఇల్లీగల్ ఎఫైర్స్ గురించి రెగ్యులర్‌గా వింటూనే ఉన్నాం. పచ్చని కాపురాలు.. వివాహేతర సంబధాల కారణంగా కూలిపోతున్నాయి. కన్న బిడ్డల భవిష్యత్ గురించి కూడా ఆలోచించకుండా కొందరు పరాయివాళ్ల మోహంలో పడి తప్పులు చేస్తున్నారు. ఈ వ్యవహారాలు ఆత్మహత్యలు, హత్యల వరకు కూడా వెళ్తున్నాయి. సగం క్రైమ్ రేట్స్‌కి కారణం అక్రమ సంబంధాలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా సత్యసాయి జిల్లాలో ఓ వివాహిత ప్రియుడితో కలిసి జంప్ అయిన ఘటన వెలుగుచూసింది.
దీంతో ఆమె భర్త బాగా హర్టయ్యాడు. తన భార్యను తీసుకెళ్లిన వ్యక్తికి వ్యతిరేకంగా.. వినూత్నంగా నిరసన తెలిపాడు. భార్య ప్రియుడు ఫొటోకి చెప్పుల దండేసి ఊరేగించాడు భర్త. తన భార్యను ఆమె ప్రియుడు దివాకర్ తీసుకెళ్లిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సైకిల్‌పై తిరుగుతూ డప్పులతో ఊరంతా చాటింపు చేయించాడు భర్త. మడకశిర మండలం క్యాంపురం గ్రామంలో ఈ విచిత్ర ఘటన జరిగింది. దివాకర్ ఫొటోను చెప్పులతో కొడుతూ.. ఆ భర్తకు సంఘీభావం తెలిపారు గ్రామస్తులు.
అవమాన భారంతో కుంగిపోలేదు ఆ భర్త. ఇలాంటి తప్పు చేసిన వెదవకి బుద్ది చెప్పేందుకు తన ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ అతడు తన భార్యపై గౌరవాన్ని ప్రదర్శించాడు. ఆమె ఫోటో బయటకు సర్కులేట్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..