Kakinada: శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టలో అపశృతి.. పలువురికి గాయాలు.. ముగ్గురు పరిస్థితి విషమం

|

Apr 15, 2022 | 4:02 PM

Kakinada: శివాలయంలో ధ్వజస్తంభ (Dhwaja Stambha) పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై.. ధ్వజస్తంభ ప్రతిష్టను వీక్షిస్తుండడంతో..

Kakinada: శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టలో అపశృతి.. పలువురికి గాయాలు.. ముగ్గురు పరిస్థితి విషమం
Dwajasthambam
Follow us on

Kakinada: శివాలయంలో ధ్వజస్తంభ (Dhwaja Stambha) పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై.. ధ్వజస్తంభ ప్రతిష్టను వీక్షిస్తుండడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో చోటు చేసుకుంది. శుక్రవారం నీలపల్లి ఆలయ ధ్వజస్తంభ .. కార్యక్రమం నిర్వహిస్తుండడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ధ్వజస్తంభాన్ని తాళ్ల సహాయంతో లేపి ప్రతిష్టిస్తుండగా.. ధ్వజస్తంభ ప్రతిష్టలో కప్పితాడు తెగిపడడంతో పలువురికి గాయాలయ్యాయి. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ క్షతగాత్రుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తుండడంతో.. ఆలయానికి భక్తులు పోటెత్తారు. పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ కూడా పాల్గొన్నారు.

 

Also Read : Multibagger Stock: ఐదేళ్లలో 9300 శాతం రాబడిని అందించిన షేర్.. మీరూ పెట్టుబడి పెట్టారా..

Viral News: ఉచితంగా హెల్మెట్‌ ఇవ్వలేదని షోరూమ్‌ యజమానిపై కేసు నమోదు.. దిగొచ్చిన కంపెనీ..

Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో ఏపీ కొత్త మంత్రికి చేదు అనుభవం.. గో బ్యాక్ అంటూ భక్తుల నిరసన