Andhra Pradesh: అర్జునుడు కావాలనుకున్నాడు… ద్రోణాచార్యుడయ్యాడు…విల్లు పట్టాడంటే గురి తప్పదు

| Edited By: Jyothi Gadda

Nov 01, 2023 | 5:29 PM

Ongole: అర్జునిడిలా గొప్ప విలుకాడు కాలేక పోయినా అలాంటి శిష్యులను తయారు చేసే ద్రోణాచార్యుడిలా మారిపోయాడు... ఆర్చరీ క్రీడలో ఆశక్తిగల విద్యార్దులను చేరదీసి శిక్షణ అందిస్తున్నాడు... ప్రస్తుతం పలువురు ఆర్చరీ క్రీడాకారులకు గోపీచంద్‌ విజయవంతంగా శిక్షణ అందిస్తున్నాడు... శిక్షణ పొందుతున్న క్రీడాకారుల్లో మానసిక స్తైర్యం నింపుతూ ఇప్పటికే, పలు క్రీడా పోటీలలో పాల్గొనేలా చైతన్యపరిచాడు గోపీచంద్.

Andhra Pradesh: అర్జునుడు కావాలనుకున్నాడు... ద్రోణాచార్యుడయ్యాడు...విల్లు పట్టాడంటే గురి తప్పదు
Archery
Follow us on

 ఒంగోలు, నవంబర్01; బాల్యం నుండే విల్లు పట్టుకొని, బాణాలు సంధించాలన్నది ఆ యువకుడి లక్ష్యం… అనుకున్నట్టుగానే ఆర్చరీ క్రీడలో రాణిస్తూ ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్న తన లక్ష్యానికి ఆర్ధిక స్టోమత అడ్డంకిగా మారింది… అయినా సరే ఎలాగైనా ఆర్చరీ క్రీడలో రాణించాలనుకున్నాడు. తనకు గల క్రీడాసక్తితో, వ్యాయామ ఉపాధ్యాయుల సలహాలను పాటిస్తూ ఆర్చరీలో గొప్ప క్రీడాకారుడుగా గుర్తింపు పొందాడు. అయితే తన కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఎదురవటంతో ఆర్చరీ క్రీడను వదలి, తాను అనుకున్న లక్ష్యాన్ని తనలాంటి క్రీడాకారులు సాధించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రస్తుతం ఆర్చరీ క్రీడపై పలువురు క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నాడు… అర్జునుడు కాలేకపోయినా ద్రోణాచార్యుడిగా రాణిస్తున్నాడు.

ఒంగోలుకు చెందిన గోపీచంద్ పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఇచ్చిన సూచనతో ఆర్చరీ క్రీడపై మక్కువ పెంచుకున్నాడు… ఆర్చరీ క్రీడలో అభ్యాసం చేసి పలు క్రీడా పోటీలలో పాల్గొని పతకాలను కూడా సాధించాడు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఖరీదైన ఆర్చరీ పోటీలలో పాల్గొనేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు… సంపన్నుల క్రీడగా గుర్తింపు పొందిన ఆర్చరీలో ముందడుగు వేయలేకపోయాడు… దీంతో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు… అయినా నిరుత్సాహానికి గురికాకుండా తన వంతు ప్రయత్నాలు చేశాడు… తనలాంటి క్రీడాకారులు ఎందరో సరైన శిక్షణ లేక ఆర్చరీ క్రీడలో రాణించలేకపోతున్నారనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించాడు… ఆర్చరీ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న గోపీచంద్‌ లక్ష్యం నీరుకారిపోయింది…

అయితే, పోయినచోటే వెతుక్కోవాలన్న సూక్తి ప్రభావంతో క్రీడాకారుడు కాలేకపోయినా, తనలాంటి ఆసక్తి ఉన్న క్రీడాకారులకు శిక్షణ అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనమెదిలింది గోపీచంద్‌కి… కొంతమంది పెద్దల సహకారంతో ఓ పాఠశాల గ్రౌండ్‌లో శిక్షణను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు… అర్జునిడిలా గొప్ప విలుకాడు కాలేక పోయినా అలాంటి శిష్యులను తయారు చేసే ద్రోణాచార్యుడిలా మారిపోయాడు… ఆర్చరీ క్రీడలో ఆశక్తిగల విద్యార్దులను చేరదీసి శిక్షణ అందిస్తున్నాడు… ప్రస్తుతం పలువురు ఆర్చరీ క్రీడాకారులకు గోపీచంద్‌ విజయవంతంగా శిక్షణ అందిస్తున్నాడు… శిక్షణ పొందుతున్న క్రీడాకారుల్లో మానసిక స్తైర్యం నింపుతూ ఇప్పటికే, పలు క్రీడా పోటీలలో పాల్గొనేలా చైతన్యపరిచాడు గోపీచంద్. తాను పోటీల్లో పాల్గొనలేకపోయినా ఆ స్థోమత, అవకాశం ఉన్న పలువురు క్రీడాకారులకు శిక్షణనిస్తూ రాణిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.