బంగారం షాపులోకి వచ్చాడు.. నచ్చిన చెవి కమ్మలు అడిగి తీసుకున్నాడు.. చేతితో పట్టుకుని చూశాడు.. షాపు యజమాని ముందే చెవి కమ్మలు తీసుకుని పరుగో.. పరుగు అంటూ దొంగ పారిపోయాడు. బంగారం ఎత్తుకెళ్లిన దొంగ యజమాని కళ్ళు కప్పలేదు.. కనికట్టు చేయలేదు.. దర్జాగా షాపులోకి వచ్చాడు… చెవి కమ్మలు తీసుకొని షాపు యజమానిని మాటల్లోపెట్టాడు. షాపు బయట ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ దొంగ ఎలా పరిగెత్తాడంటే ఒలంపిక్స్ కి పంపిస్తే మెడల్ ఖాయం అనేటంత స్వీడ్ గా పరిగెత్తాడు. రాయదుర్గం పట్టణంలో ఓ జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనాన్ని సీసీ కెమెరాలో చూసిన వారంతా…. ఆ దొంగ పరుగు పెట్టిన తీరు ఒలంపిక్స్ పంపిస్తే గోల్డ్ మెడలు తీసుకొచ్చేలా ఉన్నాడే అనుకుంటున్నారు.
రద్దీ లేని బంగారం షాపును ఎంచుకొని.. అందులోనూ షాపులో ఒక ముసలి వ్యక్తి కౌంటర్లో ఉండటానికి గమనించిన దొంగ ఇదే సరైన సమయం అనుకున్నాడు. ఇంకేముంది షాపు లోపలికి వెళ్ళాడు.. చెవి కమ్మలు కావాలని షాపు నిర్వాహకుని అడిగి నాలుగైదు రకాల చెవి కమ్మలను చూశాడు. నచ్చింది తీసుకున్నాడు. చేతిలో పట్టుకున్నాడు. ఇంతలో యజమానికి ఏదో ఫోన్ కాల్ వచ్చిందని మాట్లాడుతుండగానే.. అటు.. ఇటు చూసాడు ఇక పరుగో పరుగు అంటూ పరుగులంకించుకున్నాడు ఆ దొంగ.
షాపు యజమాని తేరుకొని తీరిగ్గా షాపు బయటకు వచ్చి చెప్పులేసుకుని వెళ్లే లోపు దొంగ కంటికి కూడా కనిపించలేదు. ఈ మొత్తం వ్యవహారం దొంగతనం జరిగిన తీరు అక్కడున్న సీసీ కెమెరాలు రికార్డు అయింది. చెవి కమ్మలు తీసుకొని ఉడాయించిన దొంగ పరుగు తీసిన విధానం చూస్తే మనోడు పరుగు పందాల్లో డిస్టిక్ ఫస్ట్ అన్నట్లుగా ఉంది. ఇంకేముంది బంగారం షాపు నిర్వాహకుడు లబోదిబోమంటూ చుట్టుపక్కలందరితో.. ఆ చుట్టుపక్కల అంతా వెతికినా.. ఎక్కడా దొంగ కనిపించలేదు.. తుపాకీ గుండుకు దొరకనంతగా పరిగెత్తి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..