Andhra Pradesh: బెజవాడలో దారుణం.. అప్పుగా సిగరెట్‌ ఇవ్వనందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

సరకులు ఇస్తే మళ్లీ ఇస్తా అంటూ అప్పు తీసుకున్నాడు.. అంతా బాగానే ఉంది.. చాలా రోజులు గడస్తున్నాయంటూ షాపు యజమాని.. ఆందోళన చెందాడు.. అప్పు తీసుకున్న వ్యక్తి కనపడగానే.. అప్పు చెల్లించాలంటూ కోరాడు.. దీంతో అతను ఇప్పుడు లేవంటూ సమాధానం చెప్పాడు.. అప్పుడు చెల్లించాలంటూ యజమాని కొప్పడ్డాడు..

Andhra Pradesh: బెజవాడలో దారుణం.. అప్పుగా సిగరెట్‌ ఇవ్వనందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు..
Crime News

Updated on: Jan 23, 2024 | 5:53 PM

సరకులు ఇస్తే మళ్లీ ఇస్తా అంటూ అప్పు తీసుకున్నాడు.. అంతా బాగానే ఉంది.. చాలా రోజులు గడస్తున్నాయంటూ షాపు యజమాని.. ఆందోళన చెందాడు.. అప్పు తీసుకున్న వ్యక్తి కనపడగానే.. అప్పు చెల్లించాలంటూ కోరాడు.. దీంతో అతను ఇప్పుడు లేవంటూ సమాధానం చెప్పాడు.. అప్పుడు చెల్లించాలంటూ యజమాని కొప్పడ్డాడు.. దీంతో నన్నే అప్పు అడుగుతావా..? అంటూ అప్పు తీసుకున్న వ్యక్తి.. ఇచ్చిన షాపు యజమానిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఈ ఘటనలో షాపు యజమాని తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.. అయితే, ఈ ఘటనలో పెట్రోల్ పోసిన వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన విజయవాడ కృష్ణలంక పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పాత బాకీ అడిగాడని చిల్లరకొట్టు వ్యాపారితో వాగ్వాదం పెట్టుకున్న శివకాసులు అనే వ్యక్తి.. కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో షాపు నిర్వహకుడు కాలిన గాయాలతో పరుగులు తీశాడు.

అసలేం జరిగిందంటే.. మద్యం మత్తులో శివకాసులు సిగిరెట్ అప్పుగా ఇవ్వాలంటూ షాపు యజమాని వెంకటేశ్వర్లును అడిగాడు. అయితే, పాతబాకీ తీర్చాలంటూ షాపు నిర్వాహకుడు వెంకటేశ్వర్లు నిలదీశాడు. ఈ క్రమంలో శివకాసులు, వెంకటేశ్వర్ల మధ్య వాగ్వాదం జరిగింది.. తననే డబ్బులు అడుగుతావా అంటూ శివకాసులు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.. ఈ ఘటనలో శివకాసులుకి మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం బడ్డీకొట్టు వ్యాపారి పరిస్థితి విషమంగా ఉండగా.. శివకాసులకు కూడా గాయాలయ్యాయని.. గాయపడ్డ ఇద్దరికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని స్థానికులు తెలిపారు.

వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us