Andhra Pradesh: తెల్లారి లేచేసరికి అతడి ఇంటి ముందు పెద్ద మట్టి దిబ్బ.. పోలీసులు తనిఖీ చేయగా షాక్

|

Jan 17, 2022 | 5:20 PM

టెక్నాలజీ విషయంలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాం. అంతెందుకు మనుషుల్ని మింగేస్తున్న కరోనా మహమ్మారి కూడా వ్యాక్సిన్ కనిపెట్టేశాం. కానీ...

Andhra Pradesh: తెల్లారి లేచేసరికి అతడి ఇంటి ముందు పెద్ద మట్టి దిబ్బ.. పోలీసులు తనిఖీ చేయగా షాక్
Treasure Hunting
Follow us on

Treasure Hunt: టెక్నాలజీ విషయంలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాం. అంతెందుకు మనుషుల్ని మింగేస్తున్న కరోనా మహమ్మారి కూడా వ్యాక్సిన్ కనిపెట్టేశాం. కానీ మాయదారి మూఢనమ్మకాలను మాత్రం కొంతమంది నుంచి దూరం చేయలేకపోతున్నాం. డైలీ ఏదో ఓ మూలన నరబలులు, చేతబడులు, రైస్ పుల్లింగ్, గుప్త నిధులకు సంబంధించిన ఘటనలు, మోసాల గురించి వింటూనే ఉన్నాం. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లోనే గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం కలకలం రేపింది. ఓ తాంత్రికుడి మాటలు నమ్మి నిజం అనుకుని.. ఇంట్లోని తవ్వకాలు చేపట్టిన ఓ వ్యక్తి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇంకొల్లు మధురానగర్‌కు చెందిన షేక్ చాంద్ భాషా అనే వ్యక్తి… ఓ తాంత్రికుడి మాటలు నమ్మి లంకె బిందెలు దొరుకుతాయనే ఆశతో ఇంట్లోనే 20 అడుగుల మేర గొయ్యి తవ్వాడు. వారం రోజులుగా ఎంత తవ్వినా,… ఎలాంటి లంకెబిందెలు లభించలేదు. పైగా, 20 అడుగుల మేర ఇంట్లో తీసిన గోయ్యి కారణంగా వచ్చిన మట్టిని వీధిలో పెద్ద గుట్టగా పోయడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

ఏదో తేడా జరుగుతుందని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఇంట్లో సోదాలు జరపగా ఈ గుప్తనిధుల వ్యవహారం వెలుగుచూసింది. దీంతో ఆ ఇంటి యజమానితో పాటు వినుకొండకు చెందిన తాంత్రికుడు మస్తాన్ ను అదుపులోకి తీసుకున్నారు. బాషా చేసిన పనితో చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా కంగుతిన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.

Also Read:  ఏపీలో పాఠశాలలకు సెలవుల కొనసాగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారీటీ

స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదం.. సెలవులు పొడిగించండి.. సీఎం​కు నారా లోకేశ్ లేఖ