AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని… కొడుకు ఆత్మహత్య.. పోలీసుల కేసు నమోదు..

తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల కుమారుడికి తండ్రి కొత్త ఫోన్ ఫోన్ కొనిచ్చాడు. అయితే కుమారుడు దానిన పొగోట్టుకోగా.. మరో కొనివ్వాలని తండ్రిని కోరాడు. కానీ తండ్రి కొనివ్వకపోవడంతో..

Andhra Pradesh: తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య.. పోలీసుల కేసు నమోదు..
Phone
Nalluri Naresh
| Edited By: |

Updated on: Aug 20, 2026 | 2:58 PM

Share

చిన్నచిన్న కారణాలతో క్షణికావేశంలో పిల్లలు తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చుతున్నాయి. తండ్రి కొత్త మొబైల్ కొని ఇవ్వలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటుచేసుకుంది. గుడిబండ మండలం సింగేపల్లి గొల్లగట్టి గ్రామానికి చెందిన సుధాకర్ (25).. తండ్రి మొబైల్ కొనివ్వలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజుల క్రితం సుధాకర్ కు తండ్రి కొత్త మొబైల్ కొనిచ్చారు. అయితే సుధాకర్ ఆ ఫోన్ ఎక్కడో పోగొట్టుకోవడంతో మరొక కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వాలని తండ్రిని సుధాకర్అడిగాడు. కొత్త ఫోన్ కొనిస్తే పోగొట్టుకొని మళ్లీ ఫోన్ ఎలా కొనివ్వాలని తండ్రి నిరాకరించాడు. అంతేకాకుండా మందలించడంతో కొడుకు సుధాకర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తండ్రి ఫోన్ కొని ఇవ్వలేదన్న క్షణికావేశంలో గొర్రెల మేపేందుకు వెళ్లి… అమరాపురం మండలం బంగారుపాలెం గ్రామం శివారులో పురుగుల మందు తాగి సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుమారుడు సుధాకర్ కోసం తండ్రి గాలించగా.. అమలాపురం మండలం బంగారుపాలెం గ్రామ శివారులో విగత జీవుడిగా పడి ఉన్న సుధాకర్ ను గుర్తించారు..

కొద్ది రోజుల క్రితమే కొత్త మొబైల్ ఫోన్ కొనిస్తే పోగొట్టుకున్న సుధాకర్… మళ్లీ మొబైల్ కొన్ని ఇవ్వమని అడగడంతో  తండ్రి మందలిచాడని, ఫోన్ కొనివ్వనని చెప్పడంతో మనస్థాపనతో సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సుధాకర్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొత్త మొబైల్ కోసం సూసైడ్ చేసుకుని తల్లిదండ్రులకు సుధాకర్ తీవ్ర దుఃఖాన్ని మిగిల్చాడని గ్రామస్తులు అంటున్నారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర