AP News: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..! ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

|

Feb 24, 2022 | 7:31 AM

Love marriage of two young womens: అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరు అమ్మాయి, మరొకరు కూడా అమ్మాయే. పెళ్లి కూడా చేసుకున్నారు వాళ్లిద్దరూ. అలా, పెళ్లి చేసుకున్నారోలేదో మొగుడూ పెళ్లాల్లా గొడవ కూడా పడ్డారు.

AP News: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..! ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. ఆ తర్వాత ఏమైందంటే..?
Love
Follow us on

Love marriage of two young womens: అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరు అమ్మాయి, మరొకరు కూడా అమ్మాయే. పెళ్లి కూడా చేసుకున్నారు వాళ్లిద్దరూ. అలా, పెళ్లి చేసుకున్నారోలేదో మొగుడూ పెళ్లాల్లా గొడవ కూడా పడ్డారు. ప్రస్తుతం ఇద్దరు యువతుల ప్రేమ పెళ్లి ఒంగోలులో టాక్‌ ఆఫ్‌ టౌన్‌గా మారింది. తామిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఏం చేయాలో అర్ధంకాక తలపట్టుకుంటున్నారు. కట్ చేస్తే.. ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఒంగోలు (ongole) పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్ళి చేసుకున్నామని ఇంట్లో చెప్పారు. దీంతో ఇరు కుటుంబాలు.. వీరి ప్రేమ వివాహానికి అభ్యంతరం తెలిపాయి. ఒకవైపు తల్లిదండ్రుల అభ్యంతరాలు కొనసాగుతుండగానే మరోవైపు ఈ యువతులు ఇద్దరూ ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట గొడవపడ్డారు. యువతులు ఇద్దరూ గొడవ పడటాన్ని గమనించిన ఓ మహిళా కానిస్టేబుల్‌ ఇద్దరినీ ఒంగోలు ఒన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇద్దరు యువతులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. ఇద్దరు రెండు నెలలుగా కలిసి తిరుగుతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ఇద్దరం కలిసి ఉంటామంటూ పేర్కొంటున్నారని.. దీనిపై విచారణ జరుగుతుందని పోలసీులు తెలిపారు. చట్ట పరిధిలో వీరిద్దరి వివాహం చెల్లుబాటు అవుతుందా.. లేదా..? అన్నకోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారా..లేదా..? అన్న విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. అయితే.. ఇద్దరు యువతుల ప్రేమ, పెళ్ళి వ్యవహారం ఒంగోలులో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read:

Jinnah Tower: మళ్లీ తెరపైకి జిన్నా టవర్ వివాదం.. జాతీయ జెండా తొలగింపుపై క్లారిటీ ఇచ్చిన జీఎంసీ

AP CRIME: ఉపాధ్యాయుడి కీచక పర్వం.. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ.. ఎవరికీ చెప్పొద్దంటూ

AP Crime News: అత్యాశ అసలుకే మోసం తెచ్చింది.. రూ. కోట్లు వసూలు చేసి జనాన్ని నట్టేట ముంచిన వెల్ఫేర్ సంస్థ..