కృష్ణా జిల్లాలో అరుదైన పునుగు పిల్లి కనిపించింది. నగరం నడిబొడ్డున ఓ ఇంటి ఆవరణలో ఈ అరుదైన పిల్లిని పట్టుకున్నారు. పునుగు పిల్లిని కనిపించిన వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దాన్ని పరిశీలించి పునుగు పిల్లి అని తేల్చారు. అనంతరం పునుగు పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. పునుగు పిల్లి చాలా అరుదైన జంతువని, అంతరించిపోతున్న జీవ జాతుల్లో ఒకటని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పునుగుపిల్లి తన ఇంట్లో దొరకడం అదృష్టం గా భావిస్తున్నాడు ఆ ఇంటి యజమాని.
వేల ఏళ్ల క్రితం సాలిగ్రామ విగ్రహంగా కొలువైన వేంకటేశ్వర స్వామి వారు.. ఇప్పటికీ అంతటి దివ్య తేజస్సుతో ప్రకాశించడానికి కారణం పునుగుపిల్లి తైలమే. ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత.. తల నుంచి పాదాల దాకా పునుగుపిల్లి తైలం పులుముతారు. అనాదిగా కొనసాగుతోందీ ఆచారం. పునుగు పిల్లి తైలం వల్ల స్వామి వారి విగ్రహానికి పగుళ్లు రాకపోవడమే కాదు, ప్రకాశమూ తగ్గకుండా ఉంటోంది
అంతటి విశిష్టమైన పునుగు పిల్లులు శేషాచల అడవుల్లో మాత్రమే ఉన్నాయి. అవి కూడా వేళ్లపై లెక్కించదగ్గ అతి తక్కువ సంఖ్యలో మాత్రమే. అందుకే.. అంతరించిపోతున్న అరుదైన జీవుల జాబితాలో ఉంది పునుగుపిల్లి. మొదట్లో శ్రీవారి సన్నిధిలో నాలుగైదు పునుగు పిల్లులను సంరక్షించేవారు. అటవీ, వన్యప్రాణ చట్టాలు అందుకు అంగీకరించకపోవడంతో వాటిని తిరుపతి, SV జూ పార్కులో ఉంచి సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎస్వీ జూ పార్కులో మూడు పునుగు పిల్లులు మాత్రమే ఉన్నాయి. స్వామి వారి అభిషేకానికి వాడే పునుగు పిల్లి తైలాన్ని టీటీడీ నిల్వ చేసి ఉంచుతుంది. పునుగు పిల్లి శరీరం.. గంధపు చెక్కకు రాజుకోవడం వల్ల పునుగు తైలం వస్తుంది.
పునుగుపిల్లి కనిపిస్తే చాటు టీటీడీ అధికారులు సంబరపడిపోతారు. వాటి సంరక్షణకు వెంటనే చర్యలు తీసుకుంటారు. శేషాచల అడవులతోపాటు ఇప్పడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో పునుగు పిల్లి కనిపిండంతో.. శేషాచలం అడువులతోపాటు ఇతర ప్రాంతాల్లో పునుగు పిల్లులు మిగిలే ఉన్నాయని తెలుస్తోంది. వాటిని వెతికి, కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తోంది.
ఇవి కూడా చదవండి: Hand of God: ఆకాశంలో కనిపించిన దేవుడి చేయి.. నాసా విడుదల చేసిన అంతరిక్షంలో అద్భుతం..