East Godavari: పిడుగు పడి నిట్టనిలువునా కాలిపోయిన కొబ్బరి చెట్టు.. వీడియో చూడండి..

మండే ఎండల్లో వర్షాలు కురుస్తున్నాయని కాస్త సంతోషించే లోపే.. గాలి వాన అతలాకుతలం చేస్తుంది. ఉభయ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో పిడుగులు పడుతున్నాయి.

East Godavari: పిడుగు పడి నిట్టనిలువునా కాలిపోయిన కొబ్బరి చెట్టు.. వీడియో చూడండి..
Lightning Strike

Updated on: May 08, 2022 | 7:11 PM

AP Rains: తెలుగు రాష్ట్రాలపై అసని తుఫాన్‌ ఎఫెక్ట్‌ స్పష్టంగా కనపడుతుంది. ఏపీలోని కృష్ణా(Krishna District), ఎన్టీఆర్‌ జిల్లా(NTR District)లో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో వీదులన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల పిడుగు పడి చెట్లు నేల కూలాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో గాలివాన, పిడుగులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కొత్తపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములతో పాటు పలుచోట్ల పిడుగులు కూడా పడ్డాయి. కుమ్మరివీధి రామాలయం వద్ద కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. పిడుగు దాటికి చెట్టుపై ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. కొబ్బరి చెట్టుపై మంటలు చూసి స్థానికులు భయపడిపోయారు. ప్రమాద సమయంలో పరిసరాల్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

ఇటు తెలంగాణలోనూ భారీ వర్షం పడింది. చేతికొచ్చిన పంట కల్లంలోనే తడిసి ముద్దయింది. భాగ్యనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉరుముల థాటికి నగరవాసులు బయపడిపోతున్నారు. ఇంటి నుంచి బయటికెళ్లిన జనాలు తిరిగి ఇంటికెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Also Read: పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ మేలు కోసమే అంటూ తన మార్క్ కామెంట్స్