వీరుడా వందనం.. పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు..

పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ఇవాళ ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. మురళీనాయక్ అంత్యక్రియల్లో పవన్ సహా మంత్రులు అనిత, సవిత, అనగాని పాల్గొననున్నారు. మురళీనాయక్‌ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు జరగనున్నాయి. వీఐపీల రాకతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు.

వీరుడా వందనం.. పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు..
Murali Naik Last Rites

Updated on: May 11, 2025 | 9:32 AM

పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ఇవాళ ఆయన స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఇందుకు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రులు లోకేష్‌, అనిత, సవిత, అనగాని సత్య ప్రసాద్ కళ్లి తండాకు వెళ్లారు. మురళీనాయక్‌ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి లోకేష్.. జవాన్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కళ్లి తండాకు చేరుకోనున్నారు. మురళీనాయక్ అంత్యక్రియల్లో పవన్ సహా మంత్రులు అనిత, సవిత, అనగాని పాల్గొననున్నారు. మురళీనాయక్‌ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు జరగనున్నాయి. వీఐపీల రాకతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు.

జమ్మూ కాశ్మీర్‌లోని LOC వద్ద పాకిస్థాన్తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి ఆయన పార్థివదేహాన్ని స్వస్థలమైన జిల్లాలోని కల్లితండాకు తీసుకొచ్చారు. అధికార లాంఛనాలతో ఇవాళ మురళీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us