Tungabhadra : మంత్రాలయం వద్ద ప్రమాదకర స్థాయిలో తుంగభద్రలో నీటి ప్రవాహం.. శ్రీశైలం డ్యాం తెరిచేది ఎప్పుడంటే?

|

Jul 27, 2021 | 11:03 AM

కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి ఇన్ ఫ్లో : 3,22,262 క్యూసెక్కులు ఉండగా..

Tungabhadra : మంత్రాలయం వద్ద ప్రమాదకర స్థాయిలో తుంగభద్రలో నీటి ప్రవాహం.. శ్రీశైలం డ్యాం తెరిచేది ఎప్పుడంటే?
Tungabhadra
Follow us on

Tungabhadra – Mantralayam – Srisailam Dam : కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి ఇన్ ఫ్లో : 3,22,262 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో : 31,784 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం : 874.40 అడుగులుగా ఉంది.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 160.9100 టీఎంసీలుగా ఉంది.

ఇక, శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వస్తోన్న వరదనీటితో రెండు రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ నిండే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తాల్సి ఉంటుంది. ఆదేశాలు రాగానే రైట్ పవర్ హౌస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలు పెడతామని.. శ్రీశైలం డ్యామ్ ఎస్ ఈ వెంకట రమణయ్య టీవీ9కు తెలిపారు.

మరోవైపు, తుంగభద్ర వరద నీరు మంత్రాలయం చేరుకుంది. ఇవాళ మంత్రాలయం దగ్గర ప్రమాద స్థాయిలో తుంగభద్ర ప్రవహిస్తోంది. వరద ఉధృతి భారీగా ఉండటంతో దర్శనం కోసం వచ్చిన భక్తుల స్నానాలు నదిలో నిలిపి వేశారు శ్రీ మఠం ఆధికారులు.

Snake

Read also : Dalita Bandhu : హుజురాబాద్‌ ఉప ఎన్నికలో మిస్సైల్‌లా మారిన ‘దళిత బంధు’