Sitaramula temple stone pillers destruction : ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల ధ్వంసం ఘటనలు ఇంకా ఆగడంలేదు. మళ్లీ మళ్లీ వివిధ ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల పరంపర కొనసాగుతోంది. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని వెంకటనాయుని పల్లెలో తాజా వెలుగు చూసిన నిర్మాణంలో ఉన్న సీతారాముల ఆలయ రాతి స్తంభాలను ధ్వంసం అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముక్కలైన రాతి స్తంభాల అంశాన్ని పోలీసులు వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆలయ నిర్మాణానికి రూ. 30 లక్షలు ఇస్తామని, సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని అభ్యర్థనలు రావడం, అయితే, ఇందుకు మరో వర్గం అంగీకరించకపోవడంతో ఎన్నికలు జరిగిపోయాయి. గెలిచిన అభ్యర్థి ఇచ్చిన మాట ప్రకారం రూ. 30 లక్షలు ఇచ్చాడు. అయితే, ఇప్పుడా ఆలయంపై దాడి జరగడంతో పోలీసులు ఆ కోణంలోనూ కూపీ లాగే పనిలో పడ్డారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.