ఇంటిముందు పుర్రె, ఎముకలు, పసుపు కుంకుమ, నిమ్మకాయలు ఉంచి పూజలు, బెంబేలెత్తిపోతోన్న గ్రామస్తులు, కర్నూలు జిల్లాలో గుబులు

|

Feb 25, 2021 | 3:07 PM

కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలం మునగపాడు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మునగాల పాడు గ్రామం లో రాములమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది. రాములమ్మ ఇల్లు తుంగభద్రా నది ఒడ్డున..

ఇంటిముందు పుర్రె, ఎముకలు, పసుపు కుంకుమ, నిమ్మకాయలు ఉంచి పూజలు, బెంబేలెత్తిపోతోన్న గ్రామస్తులు, కర్నూలు జిల్లాలో గుబులు
Follow us on

కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలం మునగపాడు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మునగాల పాడు గ్రామం లో రాములమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది. రాములమ్మ ఇల్లు తుంగభద్రా నది ఒడ్డున ఉండడంతో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాములమ్మ ఇంటి ముందు తలుపు వద్ద మనిషి పుర్రె ఎముకలు పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉంచి పూజలు చేసినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. ఉదయం నిద్ర లేవగానే తలుపు తీసిన రాములమ్మకు ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసిన ఎముకలు పుర్రె కనపడటంతో భయాందోళనకు గురై చుట్టుపక్కల వారికి తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో గ్రామంలో అనుమానాలు, భయాందోళనలను రేకెత్తాయి. రాములమ్మ సునీల్ అనే వ్యక్తి దగ్గర నెలసరి అద్దెకు ఇల్లు తీసుకొని నివాసముంటూ కూలి పని చేసి జీవనం సాగిస్తున్నారు. ఈ విషయంపై ఇంటి యజమాని సునీల్ మాట్లాడుతూ మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు ఎవరితోనూ గొడవలు లేవు అయినా నా మా ఇంటి ముందర రుద్ర పూజలు ఎందుకు చేశారు ఎవరు చేశారో మాకు అంతుచిక్కడం లేదని ఒకరకంగా భయం కలుగుతోంది.. దీనిపై గ్రామస్తులంతా మాకు ధైర్యం చెప్పారన్నారు.

మరోవైపు ఇల్లు అద్దెకు తీసుకున్న రాములమ్మ కు ఎవరైనా హాని తల పెట్టడానికి ఈ పని చేసి ఉంటారా అన్న కోణంలో కూడా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్నామని ఎవరో కావాలని అలజడి సృష్టించి భయాందోళనలను రేకెత్తించి స్వలాభం కోసం ఈ క్షుద్రపూజల పథకం పన్ని ఉంటారని దీనిని గ్రామస్తులంతా ఏకమై సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

ఇలాఉండగా, ప్రశాంతంగా ఉండే గిరిజన పల్లెల్లోనూ ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పలుచోట్ల క్షుద్ర పూజల ఆనవాళ్లు అక్కడి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామ శివార్లలో అందరూ నడిచే రోడ్డుపై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాత్రుళ్లు వింత పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామానికి ఏ అరిష్టం జరుగుతుందోనని, ఆ పల్లెల్లో జనం బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని దిబ్బగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు ఇటీవల కలకలం రేపిన సంగతి తెలిసిందే.

రెండు మూడు,రోజులుగా ఆ గ్రామంలో అందరూ నడిచే రోడ్డుపై రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. నడిరోడ్డుపై మనిషి ఆకారంలో ముగ్గులు వేసి, పసుపు, కుంకుమ జల్లి, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఆగరబత్తిలతో పూజలు జరిగినట్లు ఆనవాళ్లు ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రెండు గ్రామాల సరిహద్దుల్లో జరుగుతున్న ఈ క్షుద్రపూజల కారణంగా ప్రజలు ఊరు దాటి వెళ్లేందుకు భయపడిపోతున్నారు. పోలీసులకు పరిస్థితి గురించి వివరించి.. ఫిర్యాదు చేద్దామంటే..తమపై ఎక్కడ చేతబడులు చేస్తారోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read also :

పుష్కలంగా జీతాలందుకుంటూనే అధికారుల కమీషన్లు, లంచాల కక్కుర్తి, వైరల్‌ అవుతున్న మున్సిపాలిటీ అధికారుల ఆడియో టేపులు