నంద్యాల జిల్లా శ్రీశైలంలోని చెక్ డ్యామ్ వద్ద 7 అడుగుల భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. కొండచిలువను చూసిన భక్తులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చెక్ డ్యామ్ సమీపంలోనే ప్రజల నివాసాలు ఉండటంతో కొండచిలువ ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో స్థానికులు కొండచిలువను చూసి ఉలిక్కిపడ్డారు. కొండచిలువను గమనించిన స్దానికులకు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అలాగే ఈ విషయం తెలిసిన చుట్టుప్రక్కల వాళ్లు గుంపులు గుంపులుగా కొండచిలువను చూసేందుకు వచ్చారు. జనారణ్యంలోకి కొండచిలువ రావడంతో పలువురు అటవీశాఖ స్నేక్ క్యాచర్ శంకర్‌కి సమాచారం ఇచ్చారు. కొండచిలువ ఉండే ప్రదేశానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా కొండచిలువని పట్టుకుని దగ్గరలోని అడవి ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.