Women Suicide: జనవరిలో వివాహం.. అప్పుడే భర్త వేధింపులు.. ఆత్మహత్యకు పాల్పడిన నవవధువు.. కారణం తెలిస్తే..

|

Mar 24, 2021 | 7:17 AM

Women Suicide: భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పట్టణంలోని మాల్దార్‌పేటకు చెందిన మనీష (21) ఇంటర్మీడియేట్‌ చదివింది...

Women Suicide: జనవరిలో వివాహం.. అప్పుడే భర్త వేధింపులు.. ఆత్మహత్యకు పాల్పడిన నవవధువు.. కారణం తెలిస్తే..
Woman Suicide
Follow us on

Women Suicide: భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పట్టణంలోని మాల్దార్‌పేటకు చెందిన మనీష (21) ఇంటర్మీడియేట్‌ చదివింది. ఆమె తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో మేనమామ మహేష్‌ వద్దనే ఉంటూ చదువుకుంటోంది. ఈ ఏడాది జనవరిలో మనీషాకు పట్టణంలోని చింతరుగు వీధికి చెందిన రాజేష్‌తో వివాహమైంది. కట్నంగా రూ.15 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇచ్చుకున్నారు. రాజేష్‌ పట్టణంలో మెడికల్‌ రెప్రజెంటేటివ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.

వివాహం అనంతరం తన వ్యాపారం కోసం అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధిస్తున్నట్లు మృతురాలి మేనమామ పేర్కొన్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన మనీషా సోమవారం అర్థ రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది . కుటుంబీకులు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మనీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మేనమామ మహేష్‌ ఫిర్యాదు మేరకు మనీషా భర్త రాజేష్‌, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఓబులేసు మంగళవారం తెలిపారు.

ఇవీ కూడా చదవండి: AP Road Accident: ఏపీలో రెండు రోడ్డు ప్రమాదాలు.. బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌… తల్లీకొడుకులతో సహా నలుగురు మృతి

US Supermarket Shooting: అమెరికాలో రెచ్చిపోయిన దుండగులు.. సూపర్‌ మార్కెట్‌ వద్ద కాల్పులు.. 10 మంది మృతి