SV Mohan Reddy: ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నాయుడు లేఖ రాయించాడు : వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..

SV Mohan Reddy: ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నాయుడు లేఖ రాయించాడు : వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి
S V Mohan Reddy

Updated on: Jul 17, 2021 | 2:00 PM

YCP Leader SV Mohan Reddy – Krishna waters: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు అన్యాయమని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర జలసంఘం ఇచ్చిన గెజిట్ అడ్డుకోవాలని తన పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం సరికాదని మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాద పరిష్కారానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్ ను స్వాగతిస్తున్నామని ఆయన కర్నూలులో తెలిపారు.

పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబు పైనా మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన తన పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు లేఖ రాయించాడని ఆయన ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారు..! అంటే.. అది చంద్రబాబు నాయుడేనని మోహన్ రెడ్డి దుయ్యబట్టారు.

కాగా, జల వివాదానికి సంబంధించి కేంద్రం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్ మీద వైసీపీ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి దీనికి సంబంధించి ప్రకటన వెలువడిన అనంతరం వైసీపీ నేత మల్లాది విష్ణు సంతోషం వ్యక్తం చేయగా, అటు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఆనందం వెలిబుచ్చారు. ఇదో పెద్ద ముందడుగుగా భావిస్తున్నామని సజ్జల చెప్పుకొచ్చారు.

Read also: GVL: అపోహలు కలిగించేలా పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు : జీవీఎల్

Loading...
Unable to load recommendations.
Follow Us