Medical Student Suicide: మరో మెడికల్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య.. గదిలో కనిపించని సూసైడ్‌ లెటర్‌..!

కర్నూలు జిల్లాలో మరో మెడికల్‌ విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశ్వభారతి మెడికల్ కాలేజీలో లోకేష్ అనే మెడికల్‌ స్టూడెంట్‌ ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన..

Medical Student Suicide: మరో మెడికల్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య.. గదిలో కనిపించని సూసైడ్‌ లెటర్‌..!
Suicide

Updated on: Jun 26, 2023 | 8:52 AM

అమరావతి: కర్నూలు జిల్లాలో మరో మెడికల్‌ విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశ్వభారతి మెడికల్ కాలేజీలో లోకేష్ అనే మెడికల్‌ స్టూడెంట్‌ ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆదివారం (జూన్‌ 25) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నెల్లూరు జిల్లా కావలికి చెందిన లోకేష్‌ విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతున్నాడు. ఏమైందో తెలియదుగానీ ఆదివారం హాస్టల్‌లోని అతని గదిలో ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు. ఐతే మృతుడి గదిలో ఎలాంటి సూసైడ్‌ లెటర్‌ కనిపించక పోవడంతో ఈ ఆత్మహత్యపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు లోకేష్‌ ఆత్మహత్య గురించి తండ్రి బ్రహ్మానందరావుకి సమాచారం అందించారు. అనంతరం ఈ ఘటనపై కేసునమోదు చేసుకుని మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

ఆత్మహత్యకు గత కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువులో ఒత్తిడా? లేదా ప్రేమ వ్యవహారమా? ఈ రెండు కాకుండా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఎదిగిన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో మృతుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. కొడుకు డాక్టరై తమ కష్టాలు తీర్చుతాడని కలలుగన్నామని, ఇలా మాకు కడుపుకోత మిగులుస్తాడని ఊహించలేదని వారు విలపించిన తీరు కండతడి పెట్టించాయి. కాగా గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో మెడికో స్టూడెంట్ల వరుస ఆత్మహత్యలు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us