కర్నూల్ జిల్లా ప్రమాదం : టెంపో- లారీ ఢీ కొన్న ఘటనలో 14 మంది స్పాట్ డెడ్.. డ్రైవర్‌ నిద్రమత్తే కారణమా?

|

Feb 14, 2021 | 12:16 PM

Kurnool Accident: కర్నూల్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో- లారీ ఢీ కొన్న ఘటనలో

కర్నూల్ జిల్లా ప్రమాదం : టెంపో- లారీ ఢీ కొన్న ఘటనలో 14 మంది స్పాట్ డెడ్.. డ్రైవర్‌ నిద్రమత్తే కారణమా?
Follow us on

Kurnool Accident: కర్నూల్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో- లారీ ఢీ కొన్న ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో టెంపోలో 18 మంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన యాస్మిన్, ఆస్మా, కాశీం, ముస్తాక్‌ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. టెంపో వాహనం నుజ్జునుజ్జు కావడంతో మృత దేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి.

నజీరాబి, దస్తగిరి, అమ్మాజాన్‌, సమీరా, అమీరూన్‌, రఫి, మస్తానీ, రయాన్‌, జాఫర్‌ వలి, రోషిణి, నౌజియా, అమీర్‌జాన్‌, డ్రైవర్‌ నజీర్‌, మెకానిక్‌ షఫిలు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు క్రేన్‌ సాయంతో టెంపో వాహనం నుంచి మృత దేహాలను బయటకు తీశారు. మృతదేహాల వద్ద లభించిన ఆధార్‌కార్డులు, ఫోన్‌ నెంబర్ల ఆధారంగా బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్‌లోని బాలాజీ నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. మదనపల్లి నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

విషాదం నింపిన అరకు విహారయాత్ర.. ప్రత్యేక వాహనంలో మృతదేహాల తరలింపు.. శోక సముద్రంలో కుటుంబ సభ్యులు