Azadi Ka Amrit Mahotsav:75వ వజ్రోత్సవవేడుకల్లో అరుదైన దేశభక్తిని చాటిన కల్యాణ్‌..

ప్రజాప్రతినిధులు మొదలు సామాన్యుల వరకు అందరూ తమ ఇళ్లపై జెండాలను ఎగురువేసి వందనాలు చేశారు. ఈ క్రమంలోనే కర్నూలుకు చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి తన వెంట్రుకల్ని

Azadi Ka Amrit Mahotsav:75వ వజ్రోత్సవవేడుకల్లో అరుదైన దేశభక్తిని చాటిన కల్యాణ్‌..
75

Updated on: Aug 15, 2022 | 7:32 AM

Azadi Ka Amrit Mahotsav: ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హర్‌ఘర్‌ తిరంగ ర్యాలీలు, జెండా వందనాలు చేశారు. ప్రతి పాఠశాలల విద్యార్థులూ ఆయా గ్రామాల్లో ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండా వందనాలు చేశారు. ప్రజాప్రతినిధులు మొదలు సామాన్యుల వరకు అందరూ తమ ఇళ్లపై జెండాలను ఎగురువేసి వందనాలు చేశారు. ఈ క్రమంలోనే కర్నూలుకు చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి తన వెంట్రుకల్ని 75వ స్వతంత్ర వేడుకలకు చిహ్నాంగా క్షౌరశాలలో తీర్చిదిద్దుకున్నాడు.

భారత స్వాతంత్ర్య 75వ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఒక యువకుడు ప్రదర్శించిన దేశభక్తి వినూత్న ప్రచారానికి దారితీసింది. సాధారణంగా మన తలవెంట్రుకలను దేవుళ్లకు తలనీలాలుగా సమర్పించుకోవడం మనం చూస్తుంటాం.. అయితే, ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు తమదైన శైలిలో దేశం పట్ల భక్తి భావాన్ని ప్రదర్శిస్తున్నారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా కర్నూల్ కి చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి..తలపై 75 ఆకారం వచ్చేలా కటింగ్ చేయించుకుని దేశభక్తిని చాటుకుంటున్నాడు. దేశానికి స్వాతంత్రం వచ్చి 50 ఏళ్లు అయినప్పుడు కూడా 50 ఆకారం వచ్చేలా కటింగ్ చేయించుకుని అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు కల్యాణ్‌. అప్పటినుంచి ఇప్పటివరకు వినూత్న రీతిలో దేశం పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు తమదైన శైలిలో దేశభక్తిని ప్రదర్శించాలని కోరుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, కల్యాణ్‌ తన తలవెంట్రుకల్ని దేశభక్తి చాటుతూ హెయిర్‌ స్టైల్‌ మార్చిన వైనం అందరినీ ఆకర్షించడంతో పాటు, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కల్యాణ్‌ చేసిన పనితో కర్నూలు నగరంలో చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. విభిన్న దృక్పథంలో దేశభిమానాన్ని ప్రదర్శించిన కల్యాణ్‌ని ప్రతి ఒక్కరూ అభినందించకుండా ఉండలేకపోతున్నారు.