Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కోనసీమ అందాల మాటున తెలియని కష్టాలు.. గోదావరి గర్భంలో కలిసిపోతున్న..

Andhra Pradesh: కోనసీమ అందాల మాటున తెలియని కష్టాలు.. గోదావరి గర్భంలో కలిసిపోతున్న..

Jyothi Gadda

|

Updated on: Jun 03, 2025 | 7:55 AM

గోదావరి సోయగాలు చూడటానికి రెండుకళ్లు చాలవు. కోనసీమలోని ఈ అందాలు మరింత రమణీయం. ప్రకృతి ప్రేమికులను ఎంతగానో కట్టిపడేసే దృశ్యాలు ఈ ప్రాంతం సొంతం. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పచ్చని పొలాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ ఇంత అందమైన దృశ్యాల వెనుక కొంతమంది రైతులు, స్థానికుల కష్టాలు ఎవరికీ కనిపించడం లేదు. కోనసీమ అందాల మాటున రైతుల గుండెకోత ఉందనే విషయం చాలామందికి తెలియదు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పరిధిలోనీ పలు గ్రామాలలో సారవంతమైన భూములు నివాస గృహాలు, పచ్చని కొబ్బరి చెట్లు నదీ గర్భంలో కలిసిపోవడం రైతులకు గుండె కోతను మిగిలిస్తుంది. అప్పనపల్లి, బి దొడ్డవరం, పెదపట్నం లంక, పాశర్లపూడి పలు గ్రామాలలో వేలాది ఎకరాల భూమి, లక్షలాది కొబ్బరి చెట్లు గత కొన్ని నీళ్లుగా తమ కళ్లెదుటే గోదారమ్మ వడిలో కలసి పోవడంపై ఈ ప్రాంతంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన గ్రోవెన్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వాలు, నాయకులు మారుతున్నారు తప్ప అప్పటి నుంచి ఇప్పటివరకు వీటిని పట్టించుకునే వాళ్లు లేకుండా పోయారన్నది ఇక్కడి వాళ్ల వాదన. తుఫాన్లు, తీవ్ర తుఫాన్ల సమయంలో ఎకరాలకు ఎకరాల భూమి గోదావరి కోతకు గురవుతోంది. దీంతో ఈ భూములను నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతులు.. ఇక్కడ నివాసం ఉంటున్న స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారు.