
తెలుగునేలపై విద్యారంగ వికాసానికి చుక్కాని మన లెక్కల మాస్టారు చుక్కా రామయ్య. ఆయన గురించి ఇప్పుడు జెన్ జీ కిడ్స్‌కి తెలియకపోవచ్చేమో కానీ ఒకసారి.. నెట్టింట సెర్చ్ చేస్తే ఆయన ఎలాంటి వ్యక్తో తెలుస్తోంది. చుక్కా రామయ్య తెలుగు విద్యా రంగంలో ఒక స్ఫూర్తిదాయక ప్రతిమ. సాధారణ గ్రామీణ నేపథ్యంతో జన్మించి, ఆయన విద్యా, సామాజిక రంగాల్లో చేసిన సేవల కారణంగా “IIT రామయ్య” అనే గుర్తింపు పొందారు. 1925 నవంబర్ 20న జనగామ జిల్లా గుడూరు గ్రామంలో జన్మించారు రామయ్య. చిన్నప్పటి నుండి సామాజిక సమానత్వం, విద్యకు ప్రాధాన్యత మీద దృష్టి పెంచుకున్నారు. పాఠశాల, కళాశాల విద్యలో ఉన్న సవాళ్లను ఎదుర్కొని ఉత్తమ విద్యార్ధిగా ఎదిగారు.
రామయ్య ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణలోని అనేక పాఠశాలల్లో పనిచేసారు. 1983లో నాగార్జున సాగర్లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు. ఉద్యోగంలో ఉండగా ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉండేవాడు. ఆపై రామయ్య హైదరాబాద్‌లో ఐఐటి శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. ఐఐటీ శిక్షణలో మంచి పేరు సంపాదించి ఐఐటీ రామయ్య అని పేరు తెచ్చుకున్నారు. అయితే వేల సంఖ్యలో ఆయన వద్ద కోచింగ్ కోసం అప్లై చేసుకున్నా.. ఆయన కేవలం ప్రతిభ ఆధారంగానే 175 మందిని మాత్రమే సెలెక్ట్ చేసేవారు. సీఎం స్థాయి వ్యక్తులు రిఫర్ చేసినా కూడా సున్నితంగా తిరస్కరించేవారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఒకసారి బహిరంగంగానే చెప్పారు. తన వద్దకు ఎంతో సహచరులు, పెద్దలు వచ్చి.. ఐఐటీ రామయ్యకు చెప్పి సీటు ఇప్పించడని చంద్రబాబును అడిగేవారట. తాను ఫోన్ చేస్తే.. ఆ ఒక్క విషయం తప్ప ఇంకేమైనా అడగండి అని… సీటు మాత్రం ఇవ్వనని ఖరాఖండీగా చంద్రబాబుకు రామయ్య చెప్పేసేవారట. అంతటి నిబద్దతతో ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించి.. ప్రతితభకు ప్రొత్సాహం అందించారు. మరో 10 రోజుల్లో 101వ పడిలోకి అడుగు పెట్టనున్న చుక్కా రామయ్య… 2007 నుంచి 2013 వరకు ఉమ్మడి ఏపీలో రామయ్య శాసనమండలి సభ్యుడిగా పని చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..