Watch: ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్టార్-1లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కలకలం రేగింది. ఆలయ పరిసరాల్లో కనిపించిన నాగుపాము ఒక్కసారిగా గర్భగుడిలోకి చేరడంతో భక్తులు, ఆలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ ఘటనాస్థలికి చేరుకుని, అత్యంత విషపూరితమైన ఇండియన్ స్పెక్టాకిల్డ్ కోబ్రాను సురక్షితంగా రెస్క్యూ చేశారు. దీంతో ఆలయ అర్చకులు, భక్తులు ఊపిరి పీల్చుకుంటూ స్నేక్ క్యాచర్ బృందాన్ని అభినందించారు.

Watch: ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
King Cobra

Edited By:

Updated on: Jul 13, 2026 | 9:09 AM

పొదల్లో, పుట్టల్లో ఉండాల్సిన పాములు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. జనాల మధ్య సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆహారం కోసమో.. మరే ఇతర కారణం చేతనో ఏమో గానీ.. తరచూ కనిపిస్తూ హడలెత్తిస్తున్నాయి. విశాఖలో ఈ మధ్య కాలంలో ఎక్కడిక్కడ పాములు సంచరిస్తూ కనిపిస్తూ ఉండడం ఆందోళన రేపు ఉంది. తాజాగా.. ఓ ఆలయం గర్భగుడిలో నాగుపాము కలకలం రేపింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్టార్-1లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో పాము సంచరిస్తూ కనిపించింది. భక్తులు ఆ పామును చూసి భయపడ్డారు. అలా.. పొదల్లోకి వెళ్ళిపోతుందేమో అనుకున్నారు ఆలయ నిర్వహకులు, భక్తులు. కానీ.. ఒకసారిగా గర్భగుడిలో ప్రత్యక్షమైంది. గర్భగుడిలో నాగుపాము ఉందని ఆలయ ప్రధాన అర్చకుడు గుర్తించి.. స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు స్నేక్ క్యాచర్ కిరణ్. గర్భగుడిలో అత్యంత విషపూరితమైన ఇండియన్ స్పెక్టాకిల్డ్ కోబ్రా (నాగుపాము) ఉన్నట్లు గుర్తించారు. అత్యంత చాకచక్యంగా ఆ పామును విజయవంతంగా రెస్క్యూ చేశారు.

వీడియో చూడండి..

పామును సురక్షితంగా రెస్క్యూ చేసాక ఆలయ అర్చకులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. కిరణ్ బృందాన్ని అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us