Andhra Pradesh: గోల్డ్‌లోన్‌ కంపెనీలో రూ.8 కోట్లు స్వాహా.. అన్నం పెట్టిన కంపెనీకి సున్నం రాసిన సిబ్బంది

అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఎవరు వెళ్లకుండా వెల్లడించకుండా అంతర్గతంగా విచారణ జరిపించి విషయం బయటికి పొక్కకుండా బంగారం సర్దుబాటు చేయాలని సంస్థ యాజమాన్యం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నంలో విఫలమైన యాజమాన్యం చివరకు ఉరవకొండ కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ ఉద్యోగులే సంస్థను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Andhra Pradesh: గోల్డ్‌లోన్‌ కంపెనీలో రూ.8 కోట్లు స్వాహా.. అన్నం పెట్టిన కంపెనీకి సున్నం రాసిన సిబ్బంది
Gold Scam

Edited By: Jyothi Gadda

Updated on: Jan 27, 2025 | 8:58 PM

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో ఘరానా మోసం.. సంస్థ బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది చేతివాటం.. నకిలీ బంగారం తాకట్టు పెట్టి 56లక్షల కాజేసిన కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ ఉద్యోగులు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ లోని సొంత ఉద్యోగులే సంస్థకు పంగనామం పెట్టారు. 1,158 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలు తనకా పెట్టి 56 లక్షలు నగదు కాజేశారు. అన్నం పెట్టిన కంపెనీకే… ఉరవకొండ బ్రాంచ్ లో పనిచేస్తున్న సిబ్బంది సున్నం రాశారు.

కంపెనీ ఆడిట్ లో ఈ ఘరానా మోసం వెలుగు చూడడంతో ఫైనాన్స్ కంపెనీ రీజనల్ ప్రాజెక్ట్ హెడ్ తిరుపాల్ ఫిర్యాదు మేరకు ఉరవకొండ పోలీసులు బ్రాంచ్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ తో పాటు చాకలి వెంకటేశ్వర్లు (అసిస్టెంట్ మేనేజర్), రామాంజనేయులు(ఆడిటర్), జ్వాలా చంద్రశేఖర్ రెడ్డి(కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ జనరల్), గురునాథరెడ్డి(కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ ఏరియా మేనేజర్), నలుగురిపై కేసు నమోదు చేశారు. నకిలీ బంగారం తనకా పెట్టిన వ్యవహారం కొద్దిరోజులు కిందటే కంపెనీ ఆడిట్ లో వెలుగు చూసింది.

అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఎవరు వెళ్లకుండా వెల్లడించకుండా అంతర్గతంగా విచారణ జరిపించి విషయం బయటికి పొక్కకుండా బంగారం సర్దుబాటు చేయాలని సంస్థ యాజమాన్యం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నంలో విఫలమైన యాజమాన్యం చివరకు ఉరవకొండ కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ ఉద్యోగులే సంస్థను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు316(2),316(4),316(5)318(4) ,3(5),61(2)BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.