Jagan Cabinet 2.0: ఒక్కప్పుడు ఆ పార్టీలో.. ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలోకి.. కల్యాణదుర్గం ఎమ్మెల్యే..

|

Apr 10, 2022 | 9:35 PM

K. V. Ushashri Charan: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీని మంత్రి పదవి వరించింది. మహిళల కోటాలో అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

Jagan Cabinet 2.0: ఒక్కప్పుడు ఆ పార్టీలో.. ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలోకి.. కల్యాణదుర్గం ఎమ్మెల్యే..
K. V. Ushashri Charan
Follow us on

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీని(Ushashri Charan) మంత్రి పదవి వరించింది. మహిళల కోటాలో అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఏపీ కొత్త కేబినెట్‌లో(Jagan Cabinet) ఉషశ్రీచరణ్‌ అనూహ్యంగా మంత్రిపదవిని దక్కించుకున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉషశ్రీకి మంత్రివర్గంలో చోటు దక్కడంపై ఆమె అభిమానులు హర్షం ప్రకటిస్తున్నారు. బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకుంటున్నారు. వైసీపీలో చేరకముందు ఆమె టీడీపీ మహిళా విభాగం స్టేట్‌ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఉన్నత విద్యావంతురాలైన ఉషశ్రీ 2014లో ఆ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఐదేళ్లపాటు ఆమె పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించిన సీఎం జగన్‌.. 2019లో కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. జగన్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రత్యర్థి ఉమా మహేశ్వరనాయుడుపై దాదాపు 20 వేల ఓట్లతో గెలిచి సత్తాచాటారు. బీసీ సామాజిక వర్గం నుంచి సీనియర్లను వెనక్కు నెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఉషశ్రీ మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవడంతో అభిమానులు హర్షం ప్రకటిస్తున్నారు. తన పనితీరును గుర్తించి మంత్రిపదవి కట్టబెట్టిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఉషశ్రీ.

ఇదిలావుంటే.. ఏపీ నూతన మంత్రివర్గం కూర్పు ముగిసి.. ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యింది. మొత్తం 25 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. నూతన మంత్రివర్గం సోమవారం ఉదయం కొలువుదీరనుంది. గడిచిన మూడురోజులుగా మంత్రివర్గం కూర్పుపై ఎన్నో మంతనాలు సాగించిన సీఎం.. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రానికి తుదిజాబితాను ఖరారు చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న పార్కింగ్‌ స్థలంలో.. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా.. మంత్రుల పేర్లను ఖరారు చేసి.. ఈ జాబితాను రాజ్​భవన్​కు పంపించారు. గవర్నర్ ఆమోదించారు.

ఇవి కూడా చదవండి: Gudivada Amarnath: కార్పోరేటర్‌ నుంచి మంత్రి వరకు.. విశాఖ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌‌కు జగన్ కేబినెట్‌లో చోటు..

TRS: “ఛలో ఢిల్లీ..” టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..