Andhra: జాబ్ ఆఫర్ పోస్టర్ చూసి ఫోన్ చేసిన అమ్మాయి.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..

నిరుద్యోగ యువతే వారికి ఆదాయ వనరులు.. వాల్ పోస్టర్లే వారి పెట్టుబడి.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులను నట్టేట ముంచి లక్ష రూపాయలు గడించడమే వారి దినచర్య.. కాకినాడ జిల్లాలో అనేక ప్రాంతాల్లో అమాయిక యువతను మోసం చేస్తున్న ఘరానా ముఠా గుట్టు రట్టు చేశారు కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు..

Andhra: జాబ్ ఆఫర్ పోస్టర్ చూసి ఫోన్ చేసిన అమ్మాయి.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..
Crime News

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 03, 2025 | 6:52 PM

నిరుద్యోగ యువతే వారికి ఆదాయ వనరులు.. వాల్ పోస్టర్లే వారి పెట్టుబడి.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులను నట్టేట ముంచి లక్ష రూపాయలు గడించడమే వారి దినచర్య.. కాకినాడ జిల్లాలో అనేక ప్రాంతాల్లో అమాయిక యువతను మోసం చేస్తున్న ఘరానా ముఠా గుట్టు రట్టు చేశారు కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు.. వివరాల ప్రకారం.. ఉద్యోగాల ఆశచూపి యువత నుంచి 75 లక్షలు రూపాయలు కొట్టేసిన అంతర రాష్ట్ర ముఠాను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు.. దానికి సంబంధించి కాకినాడ జిల్లా ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఆధ్వర్యంలో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు..

వాల్ పోస్టర్‌లో ఉన్న ప్రకటన చూసి అక్టోబర్ 24 వ తారీఖున ఉద్యోగ అవకాశం ఇప్పించాలంటు కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలేనికి చెందిన నాళం గంగాభవానీ ట్రాంజ్ ఇండియా కార్పొరేట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి పోన్ చేసింది.. 24 వేలు రూపాయలు కడితే నెలకు 35 వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఇస్తామంటూ నాళం గంగా భవానీకు కంపెనీ వారు చెప్పారు.. వారి మాటలను నమ్మిన గంగాభవాని 24 వేల రూపాయలు కంపెనీకి చెల్లించింది. రోజులు గడిచినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో పిఠాపురం పట్టణ పోలీసులకు నాళం గంగా భవాని ఫిర్యాదు చేసింది..

సీ.ఐ శ్రీనివాస్, ఎస్సై మణికుమార్ దర్యాప్తు చేస్తుండగా మరికొన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి.. వాల్ పోస్టర్‌లో ప్రకటన చూసి ఇదే నంబరుకు ఫోన్ చేసి 13 వేల రూపాయలు చొప్పున తామూ ఇచ్చి మోసపోయామని కోటపల్లి సాయి, అతని స్నేహితులు పోలీసులకు తెలియజేశారు.. కాల్ డేటా ఆధారంగా రాజమహేంద్రవరం కేంద్రంగా ట్రాంజ్ ఇండియా కార్పొరేట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరితో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు..

ఏడాది కాలంలో మేనేజర్ మంజునాథ్ నిరుద్యోగుల నుంచి 75 లక్షలు రూపాయలను వసూళ్లు చేసి సంస్థకు డిపాజిట్ చేశారని పోలీసులు తెలిపారు. ఈ ముఠాను నిర్వహిస్తున్న 8మంది నుంచి ల్యాప్‌టాప్, బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, పలు నెట్‌వర్కులకు చెందిన సిమ్ కార్డులు, 53 వేల రూపాయలు, 20 గ్రాముల బంగారం, సంబంధిత కంపెనీ దుస్తులు, ప్రమోషన్ సామగ్రిను పిఠాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ కేసులో మరికొందరిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..