Kakani Govardhan Reddy: వ్యవసాయం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి కాకాణి ఫైర్

విద్యుత్ మీటర్ల విషయంలో చంద్రబాబు, నారా లోకేష్ లకు ఏం తెలుసని మాట్లాడుతున్నారో చెప్పాలని.. వారికి ఇష్టం అయితే ప్రజలకు ఇబ్బందైనా మంచిదంటూ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు

Kakani Govardhan Reddy: వ్యవసాయం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి కాకాణి ఫైర్
Kakani Govardhan Reddy

Edited By:

Updated on: May 16, 2022 | 7:01 PM

Kakani Govardhan Reddy Comments on Chandrababu: వ్యవసాయం గురించి తెలియని వ్యక్తులు ముఖ్యమంత్రికి ఏం ప్రశ్నలు సందిస్తారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు విషయంలో చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ కాకాణి మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. నాలుగో విడత రైతు భరోసా పీఎమ్ కిసాన్‌లో భాగంగా 13,500కోట్లు చెల్లించినట్లు కాకాణి తెలిపారు. రైతులకు ఇప్పటివరకూ ప్రభుత్వం 23,875 కోట్లను చెల్లింపులు చేసిందని ప్రకటించారు. రైతు రథం పథకం ద్వారా సీఎం జగన్ జూన్ 6 తేదీన 3 వేల ట్రాక్టర్లను పంపిణీ చేస్తారని తెలిపారు.

రాష్ట్రంలో వివిధ పథకాల ద్వారా 1.10 లక్షల కోట్ల మేర రైతులకు లబ్ధి చేకూరినట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి వివరించారు. వ్యవసాయం గురించి తెలియని వ్యక్తులు ముఖ్యమంత్రికి ఏం ప్రశ్నలు సందిస్తారంటూ తెలిపారు. అస‌ని తుపాను వల్ల 6 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిన‌ట్లు ప్రాధ‌మిక అంచ‌నా వేశామని తెలిపారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు విషయంలో చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ నిలదీశారు. విద్యుత్ మీట‌ర్లు పెట్టడం వ‌ల్ల వ‌చ్చే నష్టమేంటో చంద్రబాబు చెప్పాలన్నారు.

ఒక జిల్లాలో ప్రయోగాత్మంగా చేపట్టిన ప్రాజెక్టులో 30 శాతం మేర విద్యుత్ ఆదా అయినట్లు తెలిపారు. రైతుల పేరిట ఇన్నాళ్లూ ఎవరో విద్యుత్ వినియోగించారని ఆర్ధం అవుతోందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు, నారా లోకేష్ లకు ఏం తెలుసని మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు ఇష్టం అయితే ప్రజలకు ఇబ్బందైనా మంచిదంటూ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దెవా చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read:

AP BJP: బీజేపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గుడ్ బై.. రాజీనామా లేఖలో ఏమన్నారంటే..

Andhra Pradesh: ఆ సమస్యపై దత్తపుత్రుడు అప్పుడెందుకు మాట్లాడలేదు.. సీఎం జగన్ సూటి ప్రశ్న