Andhra Pradesh: ప్లాస్టిక్ పొట్ట పెట్టుకుని తాను ప్రెగ్నెంట్ అని చెప్పుకుంది.. కట్ చేస్తే సినిమాను మించిన సీన్..

|

Jan 04, 2023 | 7:57 PM

కడప రిమ్స్‌ హాస్పిటల్‌లో సినిమాటిక్‌ సీన్‌ సంచలనం సృష్టించింది. పొత్తిళ్లలో ఉండాల్సిన పిల్లాడు కన్పించకపోవడంతో ఓ తల్లి తల్లడిల్లింది.

Andhra Pradesh: ప్లాస్టిక్ పొట్ట పెట్టుకుని తాను ప్రెగ్నెంట్ అని చెప్పుకుంది.. కట్ చేస్తే సినిమాను మించిన సీన్..
Pregnancy
Follow us on

కడప రిమ్స్‌ హాస్పిటల్‌లో సినిమాటిక్‌ సీన్‌ సంచలనం సృష్టించింది. పొత్తిళ్లలో ఉండాల్సిన పిల్లాడు కన్పించకపోవడంతో ఓ తల్లి తల్లడిల్లింది. మరోవైపు అమ్మా అని పిలిపించుకోవాలనే ఆర్తి మరో మహిళను ఇరకాటంలో పడేసింది. అవును ఇద్దరు మహిళలు.. ఎవరి ఆవేదన వారిదే.. కానీ, మధ్యలో చిన్నారి మిస్సింగ్‌తో హాస్పిటల్‌లో కలకలం రేగింది. చివరకు ఎనిమిది రోజుల బాబుని అమ్మ ఒడికి చేర్చారు రిమ్స్‌ సిబ్బంది. ఈ గ్యాస్ జరిగిన సీన్.. ఆస్పత్రి సిబ్బందికి ముచ్చెమటలు పట్టించింది.

ఈ సినిమాటిక్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. షబ్నంకు పిల్లలంటే పంచప్రాణాలు. కానీ పెళ్లి జరిగి ఐదేళ్లయినా సంతానం కలగలేదు. ఎందరో వైద్యులను సంప్రదించింది. చివరకు ఏదైనా అనాథశ్రమం నుంచి పాపనో, బాబునో దత్తత తీసుకోవాలనుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. కట్‌ చేస్తే.. సీన్ క్రైమ్‌లా మారింది. తల్లి కావాలనే తపనతో షబ్నం గూగుల్‌లో శోధించి.. ఆన్‌లైన్‌లో ప్లాస్టిక్‌ బెల్లిని తెప్పించుకుంది. దీన్ని ధరించి ప్రెగ్నెంట్‌లా రిమ్స్‌ హాస్పిటల్‌కు వచ్చింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళతో మాట కదిపింది. లాలిస్తున్నట్టు నటించి 8 రోజుల పసిగుడ్డును తీసుకొని వెళ్లిపోయింది. ఇంతలో బాబు కన్పించడంలేదని తల్లి గొల్లుమనడంతో సిబ్బంది అలెర్ట్ అయ్యారు. సీసీ టీవీ ఫుటేజీ గమనిస్తే ఈమె ఆటోలో వెళ్తున్న సీను తళుక్కుమంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆటోను ఫాలో అయ్యారు ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు. ఎట్టకేలకు షబ్నమ్‌ను ట్రేసి.. పిల్లాడిని తల్లి ఒడికి చేర్చారు.

జరిగిందంతా సీన్‌ టు సీను ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ వివరించింది సదరు మహిళ. తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చేందో చెప్పింది. ఐదేళ్లు అయినా తల్లి కాకపోవడంతో.. ఆన్‌లైన్‌లో ప్లాస్టిక్‌ బెల్లిని కొని తను ప్రెగ్నెంట్‌నని బంధుమిత్రులను నమ్మించింది. 9 నెలలు దగ్గర పడుతుండంతో వాళ్లు వీళ్లు అడుతారు కాబట్టీ.. పిల్లాణ్ని కిడ్నాప్‌ చేసింది. అబద్దాన్ని నిజం చేయాలనే క్రమంలో ఈ క్రైమ్‌కు పాల్పడింది షబ్నం. కారణం ఏదైనా నేరం నేరమే కదా. షబ్నమ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. కాగా, కిడ్నాప్‌ లొల్లితో పాటు ఈ ప్లాస్టిక్‌ బెల్లి వ్యవహారం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..