AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..

సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బాలికని గండికోట తీసుకెళ్లిన ప్రియుడు లోకేష్‌... 10 గంటల 40 నిమిషాలకి ఒక్కడే వెనక్కి వెళ్లిపోయాడు. బాలిక కాలేజ్‌కి వెళ్లలేదనే విషయం ఇంట్లో తెలిసిందని భయపడి... తనను అక్కడే వదిలేసి లోకేష్‌ వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత గండికోటకు బాలిక బంధువు సురేంద్ర వెళ్లినట్టు గుర్తించారు.

Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2025 | 4:59 PM

Share

ప్రియుడు చంపలేదు..! ఆత్మహత్యా జరగలేదు..! మరి మైనర్‌ బాలిక ఎలా చనిపోయింది..? పరువు హత్య ఏమైనా జరిగి ఉంటుందా..? అసలేం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థి వైష్ణవి హత్య మిస్టరీగా మారింది. బాలికను ప్రియుడు లోకేష్‌ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అసలు, మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని పోలీసులు పేర్కొనడం సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆమెపై లైంగిక దాడి కూడా జరగలేదని వెల్లడించారు. గండికోటను పరిశీలించిన ఎస్పీ, డీఐజీ కీలక ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యప్తు ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు.

సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బాలికని గండికోట తీసుకెళ్లిన ప్రియుడు లోకేష్‌… 10 గంటల 40 నిమిషాలకి ఒక్కడే వెనక్కి వెళ్లిపోయాడు. బాలిక కాలేజ్‌కి వెళ్లలేదనే విషయం ఇంట్లో తెలిసిందని భయపడి… తనను అక్కడే వదిలేసి లోకేష్‌ వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత గండికోటకు బాలిక అన్న సురేంద్ర వెళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.

బుధవారం స్పాట్‌కి ఎస్పీతో పాటు వెళ్లిన డీఐజీ ప్రవీణ్ పలు కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. అయితే బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తెలిపారు. బాలిక శరీరంపై దుస్తులు లేకుండా పడి ఉండడం వల్ల అఘాయిత్యం జరిగిందని అందరూ భావించారని, అయితే అలాంటిది ఏమీ జరగలేదన్నారు. నిందితుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డీఐజీ ప్రవీణ్ పేర్కొన్నారు

హత్య ఎలా జరిగిందన్న విషయాన్ని వీలైనంత త్వరగా చేధిస్తామని.. స్పెషల్‌ టీమ్‌తో పాటు డాగ్ స్వాడ్‌ను రంగంలోకి దింపినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు… వైష్ణవి హత్య కేసులో కుటుంబ సభ్యులను సైతం విచారించనున్నారు పోలీసులు.

ఎన్నో ట్విస్టులతో హత్యా…? లేదా పరువు హత్యా…? ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు కొనసాగుతోంది. బాలికను చంపింది ఎవరనేదానిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గండికోటలో సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..