ఏలూరు(Eluru) జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. పోరస్ పరిశ్రమలో పేలుడు జరగడం అత్యంత బాధాకరమన్నారు. ఆరుగురు కార్మికులు సజీవదహనం అయిన విషయం తెలిసి ఎంతో ఆవేదనకు గురయ్యానని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మికుల కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడం కరెక్ట్ కాదన్నారు. ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అధికార యంత్రాంగం భద్రతా ప్రమాణాలపై తనిఖీలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయని పవన్ ఆరోపించారు.
ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి గ్యా్‌స్ లీక్ అయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పోరస్ ఫ్యాక్టరీలోని యూనిట్-4 లో మంటలు చెలరేగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో విధుల్లో 17 మంది కార్మికులు ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనం కాగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.
పోరస్ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు.
Also Read
Kajal Aggarwal: భర్తను పొగడ్తలతో ముంచేసిన కాజల్.. త్వరలో జీవితాలు మారిపోతాయంటూ..
PM Narendra Modi: ఏలూరు ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం.. మృతుల కుటుంబాలకు సంతాపం