Andhra Pradesh: ప్రభుత్వ కేటాయింపులు వైసీపీ నేతల కమీషన్లకే సరిపోతున్నాయి.. నాదెండ్ల మనోహర్ ఘాటు వ్యాఖ్య

|

May 09, 2022 | 5:05 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు. రాష్ట్రంలోని గ్రామాలకు రోడ్లు నిర్మించేందుకు....

Andhra Pradesh: ప్రభుత్వ కేటాయింపులు వైసీపీ నేతల కమీషన్లకే సరిపోతున్నాయి.. నాదెండ్ల మనోహర్ ఘాటు వ్యాఖ్య
Janasena Nadendla Manohar
Follow us on

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు. రాష్ట్రంలోని గ్రామాలకు రోడ్లు నిర్మించేందుకు రూ.300 కోట్లు అవసరమైతే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం రూ.26.50 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. ప్రభుత్వ కేటాయింపులు వైసీపీ(YCP) నేతల కమీషన్లకే సరిపోవడం లేదని ఆరోపించారు. రోడ్లు వేయలేని వాళ్లు రాజధాని ఎలా కడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలు, యువతులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మహిళలపై నేరాలు జరుగుతుంటే వాటికి తల్లుల పెంపకమే తప్పని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన దిశ చట్టం ఎటుపోయిందని, మహిళలకు రక్షణ కల్పించాలని నిరసనలు చేస్తుంటే వారిపై కేసులు ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలిపితే అడ్డుకోవడం భావ్యం కాదన్న నాదెండ్ల.. పోలీసులు అనుసరించిన వైఖరి అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించారు.

మరోవైపు.. గతంలో నంద్యాల జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ పొత్తుల విషయంపై కీలక ప్రకటన చేశారు. ప్రజల పక్షాన నిలబడి, వారికి సహాయం చేసేందుకు ముందుకు వస్తానని, అంతే తప్ప వ్యక్తిగతంగా లాభాపేక్ష పెట్టుకోనని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాట తాను తెచ్చుకున్నది కాదన్న జనసేనాని.. ఆలా అనడానికి వైసీపీ పాలనే కారణమని వివరించారు. వ్యతిరేక ఓటు చీలి వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత దిగజారిపోతుందని ఆవేదన చెందారు.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలన్న పవన్.. ఎవరెవరు కలిసొస్తారో తనాకూ తెలీదన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్‌కి ఎదురొడ్డి నిలిచాయని.. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను సరిదిద్దాలంటే ఓటు చీలిపోకూడదని చెప్పారు. అదే జరిగితే ప్రజలకు ఇంకోసారి నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీచదవండి

Bangaluru: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మధ్యాహ్నం భోజనం చేశాక హాయిగా నిద్రపోవచ్చు