Janasena: బాధితులపై నిందలు వేసి తప్పించుకోవాలనుకోవడం సిగ్గు చేటు.. ఏపీ ప్రభుత్వంపై నాదెండ్ల మనోహర్ ఫైర్

|

May 01, 2022 | 4:55 PM

రేపల్లె(Repalle) రైల్వే స్టేషన్ లో మహిళా వలస కూలీపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని జనసేన(Janasena) లీడర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పొట్ట కూటి కోసం వలస వచ్చిన కుటుంబానికి ఎదురైన...

Janasena: బాధితులపై నిందలు వేసి తప్పించుకోవాలనుకోవడం సిగ్గు చేటు.. ఏపీ ప్రభుత్వంపై నాదెండ్ల మనోహర్ ఫైర్
Janasena Nadendla Manohar
Follow us on

రేపల్లె(Repalle) రైల్వే స్టేషన్ లో మహిళా వలస కూలీపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని జనసేన(Janasena) లీడర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పొట్ట కూటి కోసం వలస వచ్చిన కుటుంబానికి ఎదురైన ఈ దిగ్భ్రాంతికర ఘటన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిని తెలియచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకొంటున్నా ముఖ్యమంత్రి జగన్ స్పందించడం లేదని, బాధిత కుటుంబాలపైనే నిందలు వేసి తప్పించుకోవాలని ప్రభుత్వం చూడటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. తుమ్మపూడి ఘటనలో పోలీసు అధికారుల తీరు ఇలాగే ఉందన్న మనోహర్.. రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రకటనలు కూడా ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలకు తల్లులే కారణమని, వాళ్లు సరిగా లేకపోవడమే కారణం అని చెప్పడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. రేపల్లె సామూహిక అత్యాచారానికి ఏ తల్లి తప్పు ఉంది..? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి ఏ తల్లి తప్పిదమో రాష్ట్ర హోం శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

విజయవాడ అత్యాచార ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు చూశాక.. రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అవగాహనారాహిత్యం అర్థమైంది. హోం శాఖను, పోలీసులను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఫలితమే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం. చిత్తశుద్ధి లేకుండా చట్టాలు చేసి ప్రచారం చేసుకోవడం వల్ల ఏ ఒక్క ఆడ బిడ్డకు భరోసా లభించదు. తాడేపల్లి ఇంటి నుంచి కదలని ముఖ్యమంత్రి.. ఒకసారి బయటకు వచ్చి బాధిత కుటుంబాలను పలకరిస్తే ఆడ పిల్లల తల్లితండ్రులలో ఉన్న భయాందోళనలు తెలుస్తాయి. రాష్ట్రంలోని కీచక పర్వాన్ని ఖండించే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల వారిని కట్టడి చేసి అరెస్టులు చేయడం మాని, మహిళల రక్షణపై చిత్తశుద్ధిగా పని చేయండి. రేపల్లె ఘటనలో బాధితురాలు నాలుగు నెలల గర్భిణి అని తెలిసింది. ఆమె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలి

        – నాదెండ్ల మనోహర్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్

మరోవైపు.. రేపల్లెలో జరిగిన అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన బాపట్ల పోలీసులు.. నిందితుల్లో ఒకరు మైనర్ అని వెల్లడించారు. అవనిగడ్డలో పని చేసేందుకు దంపతులిద్దరూ నిన్న అర్ధరాత్రి రేపల్లే రైల్వేస్టేషన్‌లో దిగారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోని బెంచ్ పై పడుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన భర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారమి బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.

మరిన్న ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Rukshar Dhillon: చిలకపచ్చ శారీలొ  క్యూట్ లుక్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ముద్దుగుమ్మ ‘రుక్సార్ ధిల్లాన్’..

APSRTC: ఆ జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఏడు వేల మందికి ఎలక్ట్రిక్ వాహనాలు..!