Pawan Kalyan: పంజాబ్ ఘటన దురదృష్టకరం.. ప్రధాని మోడీ భద్రతలో వైఫల్యంపై పవన్ కామెంట్స్..

|

Jan 07, 2022 | 4:18 PM

Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం కోసం పంజాబ్ వెళ్తున్న సమయంలో.. రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కొంతమంది ప్రధాని మోడీ కాన్వాయ్ ని..

Pawan Kalyan: పంజాబ్ ఘటన దురదృష్టకరం.. ప్రధాని మోడీ భద్రతలో వైఫల్యంపై పవన్ కామెంట్స్..
Pawan Pm Modi
Follow us on

Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం కోసం పంజాబ్ వెళ్తున్న సమయంలో.. రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కొంతమంది ప్రధాని మోడీ కాన్వాయ్ ని అడ్డుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. పంజాబ్ సంఘటన దురదృష్టకరమని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎదురైన సంఘటనను దురదృష్టకరమన్నారు జనసేనాని. అంతేకాదు ప్రధాని కారు రోడ్డు మీద 20 నిమిషాలపాటు ముందుకు వెళ్లలేక… అలాగే రోడ్డుపైనే  కారు నిలిచిపోయే పరిస్థితి అవాంఛనీయమన్నారు.  ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కు..  అయినప్పటికీ ప్రధాని భద్రతకు ఇబ్బంది కలిగేలా ఆ నిరసన ఉండరాదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రిని గౌరవించడం అంటే మన జాతిని, మన దేశాన్ని గౌరవించడమే… అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంయమనం పాటించిన  నరేంద్ర మోడీకి గౌరవపూర్వక అభినందనలను చెప్పారు జనసేన అధినేత. అంతేకాదు ఎటువంటి పరిస్థితులలోనూ ప్రధాన మంత్రి గౌరవానికి భంగకరంగా ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఎటువంటి వ్యక్తులైనా ప్రవర్తించరాదని తన అభిప్రాయమన్నారు జనసేనాని.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ భద్రతలో లోపంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే..

 

Also Read:

 అన్ని రికార్డులను భద్రపరచండి.. ప్రధాని మోడీ భద్రతలో లోపంపై సుప్రీం కోర్టు కీలక విచారణ..

 దేశంలో పంజా విసురుతున్న కరోనా.. సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా మహారాష్ట్ర..!

ఎయిర్‌టెల్‌ కొత్త సేవలు.. పార్కింగ్‌, కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల్లో ఫాస్టాగ్‌.. !