Janasena: టార్గెట్ 100.. రూట్ మార్చిన జనసేనాని.. రాష్ట్రస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు కమిటీలు

జనసేన రూటు మార్చిందా..? టార్గెట్ ను పెంచిందా..? గ్రౌండ్ లెవల్ లో పునాది గట్టిగా ఉంటే పార్టీకి ఢోకా ఉండదనే ఆలోచనకు వచ్చిందా..? సడెన్ గా పవర్ స్టార్ లో వచ్చిన ఈ మార్పునకు కారణం ఏమిటి.? ఇదే ఇప్పుడు జనసైనికులు డిస్కస్‌ చేసుకుంటున్నారు.

Janasena: టార్గెట్ 100.. రూట్ మార్చిన జనసేనాని.. రాష్ట్రస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు కమిటీలు
Janasena

Updated on: Oct 08, 2022 | 4:08 PM

జనసేనకు చాలా టైమ్‌ దొరికింది.. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనుకుని కాస్తా గాబరా పడినా.. అలాంటిదేమీ లేదని అర్థమయ్యాక జనసేనాధిపతి రూటు మారుస్తున్నారట.. టార్గెట్‌ పెంచుకుని పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారట. వైసీపీ ముందస్తుకు వెళ్లదని సంకేతాలు రావడంతో.. జనసేనకు కావాల్సినంత టైమ్‌ దొరికిందని జనసైనికులే చెప్పుకుంటున్నారు. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా.. గ్రౌండ్‌ లెవెల్‌ నుంచి పార్టీని స్ట్రాంగ్‌ చేసుకోవాలనుకుంటున్నారట పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడు జనసేన టార్గెట్ 100 అసెంబ్లీ స్థానాలు. వచ్చే ఎన్నికల్లో వీటిని కైవసం చేసుకోవడానికి..పవన్‌ కల్యాణ్‌ ప్రణాళిక రచిస్తున్నారట.. ఇప్పటికే జనసేనకు బలం పెరిగిందని.. సర్వేలు చెబుతుండటంతో.. మరింత కష్టపడితే..ఇంకా మంచి ఫలితాలు సాధించొచ్చని పవన్‌ భావిస్తున్నారట. అందుకే పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు.. రాష్ట్రస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. టాప్‌ టు బాటమ్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు జనసేనాని..

ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షుల నియామకం జరగనుంది. వచ్చే 5 రోజుల్లో నియోజకవర్గాల సమీక్షలపై షెడ్యూల్ విడుదల చెయ్యబోతున్న జనసేన.. క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాలంటీర్స్‌కు ఆహ్వానం పంపింది. అటు జనసేన కౌలురైతు భరోసా యాత్రలను కూడా కంటిన్యూ చేయనున్నారట. ఈ నెలలోనే చిత్తూరు జిల్లా టూర్‌ కూడా ప్లాన్‌ చేశారట.. ఏపీలోనే కాదు.. అటు తెలంగాణ వైపు కూడా దృష్టి పెట్టిన పవర్ స్టార్..అక్కడా పార్టీ విస్తరణకు వ్యూహాలు రచిస్తున్నారట. తెలంగాణలో సైతం.. బహిరంగ సభలు నిర్వహించాలని.. నియోజకవర్గ ఇంచార్జీలు, మండలాధ్యక్షులను నియమించాలని భావిస్తున్నారట.

ఎన్నికలకు చాలా టైముంది.. ఈ లోపు కొన్ని సినిమాలు కూడా చేసే వీలుంది. దీంతో.. పార్టీకి ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉండదని పవన్‌ ప్లాన్‌.. మరి ఆయన లెక్కలు ఎన్నికలనాటికి పనికొస్తాయా.. తారుమారవుతాయా అన్నది కాలమే చెప్పాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us