
క్యాలెండర్ మారగానే వచ్చే తొలి పెద్ద పండగ సంక్రాంతి. అప్పాలు, పండగ సంబరాల కంటే కూడా.. కోళ్లు, జంతువులతో జరిగే క్రీడలే అసలు సంక్రాంతి అన్నట్టుగా మార్చేశారు. ఆంధ్రాలోనే కాదు.. తమిళనాట కూడా ఇదే సంప్రదాయం. ఈ రెండు రాష్ట్రాల్లో కామన్‌గా కనిపించే ఓ పశు క్రీడ.. జల్లికట్టు. తమిళనాడులో దాన్ని జల్లికట్టు అంటారు, ఆంధ్రాలో మాత్రం పశువుల పండుగ అంటుంటారు. ఈ రెండింటికీ మధ్య తేడా ఉందంటుంటారు. ఇంతకీ.. ఏంటీ వ్యత్యాసం? కొమ్ములు తిరిగిన ఎద్దులు బరుల వెంట పరుగులు తీస్తుంటే.. కండలు తిరిగిన యువకులు వాటిని లొంగదీసుకోవడమే కదా. జల్లికట్టులోనైనా, పశువుల పండుగలోనైనా.. ఆ ఎద్దులను జరిగేది అదే కదా. మరి.. తేడా ఏంటి? గాలి పటాలు, రంగవళ్లులు, పిండివంటలు, కోడి పందెలు, ప్రభలు, పడవ పోటీలు.. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే ఇదే. కాని, కాస్త సీమ వైపు వెళ్తే పండగ వాతావరణం మరోలా ఉంటుంది. ప్రతి సంక్రాంతి వేళ చిత్తూరు జిల్లాలో జరిగే పశువుల పండగకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇది ఆంధ్రా జలికట్టు. చిత్తూరు జిల్లాలో జరిగే ఆంధ్రా జల్లికట్టులో పందేలుండవ్. బెట్టింగులూ ఉండవ్. పశువులను గౌరవించే పద్దతే ఉంటుందిక్కడ. పైగా కొత్తగా పుట్టుకొచ్చింది కాదిది. తరతరాల సంప్రదాయం. అందుకే, అంబరాన్నంటే ఆ సంబరాలు చూడ్డానికి ఏపీలోని నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి, చుట్టుపక్కల కర్నాటక, తమిళనాడు నుంచి జనం తరలివస్తారు. జల్లికట్టు చూడ్డానికి తమిళనాడుకు వెళ్లలేని వాళ్లు.....