Thunder Bolt: వాన పడ్తోందని చెట్టుకిందకు వెళ్తే..ఇక అంతే సంగతులు!

వర్షం కురిసేటప్పుడు సాధారణంగా అందరం రోడ్లపై ప్రయాణం చేస్తూ ఉంటే తడవకుండా ఉండేందుకు సడన్‌గా చెట్లు కిందకు లేదా దగ్గరలో తడవకుండా ఉండే ప్రదేశాలకు వెళ్లి తల తడవకుండా కాపాడుకుంటాం.. అయితే పొలాల్లో పని చేసేవారు కూలీ పనులు చేసేవారు, పనులు చేస్తున్న సమయంలో సడన్‌గా వర్షం కురిస్తే పొలాలలో ఉన్న చెట్ల కిందకు వెళ్లి తడవకుండా చూసుకుంటారు.

Thunder Bolt: వాన పడ్తోందని చెట్టుకిందకు వెళ్తే..ఇక అంతే సంగతులు!
Thunder Bolt

Edited By:

Updated on: Oct 07, 2024 | 5:32 PM

వర్షం కురిసేటప్పుడు సాధారణంగా అందరం రోడ్లపై ప్రయాణం చేస్తూ ఉంటే తడవకుండా ఉండేందుకు సడన్‌గా చెట్లు కిందకు లేదా దగ్గరలో తడవకుండా ఉండే ప్రదేశాలకు వెళ్లి తల తడవకుండా కాపాడుకుంటాం.. అయితే పొలాల్లో పని చేసేవారు కూలీ పనులు చేసేవారు, పనులు చేస్తున్న సమయంలో సడన్‌గా వర్షం కురిస్తే పొలాలలో ఉన్న చెట్ల కిందకు వెళ్లి తడవకుండా చూసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ చెట్లే శాపంగా మారాయి. వాన పడుతుందని చెట్టు కింద నిలబడితే ఇంకా అంతే సంగతులు ప్రాణాలు క్షణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలం సోమవారం గ్రామంలో టమాటా తోటలు కూలి పని చేసుకుంటున్న కూలీలు సడన్‌గా వానపడుతుండడంతో పొలంలోని చెట్టు కిందకు వెళ్లి తలదాచుకున్నారు. అంతే ఒక్కసారిగా పిడుగు పడటంతో చెట్టుకింద ఉన్న 15 మందిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా గతంలో కంటే ఇప్పుడు చెట్లపై ఎక్కువగా పిడుగులు పడుతున్నాయి. అయితే గతంలో ఎత్తైన చెట్ల వద్దనే అంటే తాటి చెట్ల వద్దనే పిడుగులు పడతాయని పెద్దలు చెబుతూ ఉండేవారు.. కానీ ఇప్పుడు ఓపెన్‌గా ఉన్న ప్రదేశాలలోని చెట్ల పైన పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా కూలి పనులకు అందులోను పొలం పనులకు వెళ్లేవారు ఈ వర్షం పడే సమయంలో చెట్టు కిందకు వెళ్లకుండా ఉండాలి వైద్యులు సూచిస్తున్నారు.