ISRO: పీఎస్‌ఎల్వీ-సీ59 రాకెట్‌ ప్రయోగం సక్సెస్.. సూర్యకిరణాలపై అధ్యయనం

|

Dec 06, 2024 | 9:39 AM

PSLV - C59 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ప్రోబా3 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. రెండు ఉపగ్రహాల్లో ఒకటి సూర్యకిరణాలపై అధ్యయనం చేస్తుంది. మరో ఉపగ్రహం కరోనాపై విశ్లేషణ చేయనుంది.

ISRO: పీఎస్‌ఎల్వీ-సీ59 రాకెట్‌ ప్రయోగం సక్సెస్.. సూర్యకిరణాలపై అధ్యయనం
PSLV-C59/PROBA-3
Follow us on

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి చేపట్టిన PSLV- C 59 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది ఉపగ్రహం. ప్రోబా 3 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. దీంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా3 సూర్యకిరణాలపై అధ్యయనం చేయనుంది. ప్రోబా 3లో రెండు ఉపగ్రహాలున్నాయి. 310 కేజీల బరువుండే కరోనా గ్రాఫ్‌ స్పేస్‌, 240 కేజీల బరువున్న ఓకల్టర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ ఈ రాకెట్‌లో ఉన్నాయి. ఈ జంట ఉపగ్రహాలు కక్ష్యలో లాబొరేటరీలా పనిచేస్తాయి. ఈ రెండు ఉపగ్రహాలు కలిసి కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టిస్తాయి. ఆ తర్వాత ఆ కృత్రిమ గ్రహణాన్ని అధ్యయనం చేస్తాయి. ఈ జంట ఉపగ్రహాల్లో ఒకటిని సూర్యుడిని కప్పి కృత్రిమ గ్రహణం సృష్టిస్తే.. మరొకటి కరోనాపై విశ్లేషణ చేస్తుంది. ఈ మిషన్‌ను స్పెయిన్‌, పోలాండ్‌, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తల సహకారంతో రూపొందించారు. ఈ ప్రయోగాన్ని ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ సహకారంతో నిర్వహించింది.

మొదట ఈ మిషన్‌ను బుధవారం సాయంత్రమే ప్రయోగించాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో గురువారం ప్రయోగించారు. ఇస్రో దగ్గరున్న ఐదు PSLV వేరియంట్లలో రాకెట్‌ XL వెర్షన్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌. అందుకే ఈ ప్రయోగానికి రాకెట్‌ XL వెర్షన్‌ను ఎన్నుకున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ PSLV రాకెట్లలో 4 బూస్టర్లు మాత్రమే ఉండగా, రాకెట్‌ XL వెర్షన్‌ ఆరు బూస్టర్లను కలిగి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..